
జనరల్

మెగాస్టార్ చిరంజీవి టాక్ షో రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘మెగావర్స్’ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. ఇప్పటికే ఈ షో షూటింగ్ ప్రారంభమవగా, చిరంజీవి రెండు ఎపిసోడ్ల చిత్రీకరణను పూర్తి చేసినట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం, ఈ షోలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలిసి ఓ ప్రత్యేక ఎపిసోడ్లో సందడి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మెగా కుటుంబానికి చెందిన ముగ్గురు స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకు అది ప్రత్యేకమైన అనుభూతిగా నిలవనుంది. ఈ ఎపిసోడ్‌కు భారీ స్థాయిలో డిజిటల్ ఆదరణ లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఉలగనాయగన్ కమల్ హాసన్ కూడా ఈరోజు షూటింగ్లో పాల్గొన్నట్లు తాజా సమాచారం. అయితే ప్రత్యేక ఎపిసోడ్ల వివరాలు, షో ప్రీమియర్ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!