

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో కొనసాగుతున్న ‘బీబీ హోటల్’ టాస్క్‌తో హౌస్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ టాస్క్‌లో రెడ్ జోన్ సభ్యులు హోటల్ వర్కర్లుగా, ఎల్లో జోన్ సభ్యులు హోటల్ యజమానులుగా, గ్రీన్ జోన్ కంటెస్టెంట్లు అతిథులుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ ఆటను ప్రవేశపెట్టారు. కంటెస్టెంట్లను రెండు జట్లుగా విభజించి, ఒక్కో జట్టులో ఒక యజమాని, ఇద్దరు వర్కర్లు ఉండేలా ఏర్పాటు చేశారు. డైస్లో వచ్చిన సంఖ్య ఆధారంగా పటంపై ముందుకు కదులుతూ పోటీపడ్డారు. ఆటలో భాగంగా ఇచ్చిన ఫన్నీ పనిష్మెంట్లు ప్రేక్షకులను అలరించాయి. సుధీర్ కొంతసేపు తలకిందులుగా ఉండటం, వంశీ ఓల్డ్ ఫారిన్ మ్యాన్ తరహాలో నటించడం, వంశీ-శ్వేత కలిసి చేసిన కామెడీ హౌస్‌లో నవ్వులు పూయించాయి.
బీబీ హోటల్ టాస్క్ ముగిసే సమయానికి అత్యధిక స్టార్లు సాధించిన రామ్ ప్రసాద్, వర్షిణి రెడ్ జోన్ నుంచి నేరుగా గ్రీన్ జోన్లోకి చేరుకున్నారు. ఎక్కువ డబ్బు సాధించిన వంశీ రెడ్ జోన్ నుంచి ఎల్లో జోన్‌కు మారాడు. దీంతో హౌస్‌లో జోన్ల సమీకరణాలు మారిపోయాయి. మరోవైపు ఈ వారం ఎలిమినేషన్ కోసం రోహిత్, వంశీ, దేబ్జానీ, శివ, సుధీర్, ఝాన్సీ నామినేషన్లలో ఉన్నారు. గత వారం డబుల్ ఎలిమినేషన్లో షాలినీ పటేల్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన నేపథ్యంలో, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. సరదా టాస్కులతో పాటు నామినేషన్లతో బిగ్‌బాస్ హౌస్‌లో పోటీ మరింత రసవత్తరంగా మారింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!