

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 18వ రోజు ఎపిసోడ్ రెండో ప్రోమో ఆసక్తిని పెంచుతోంది. మూడో వారం ‘టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్’లో భాగంగా గార్డెన్ ఏరియాలో కేకులు, బర్గర్లు, చికెన్ లెగ్ పీసులు, బన్స్, కూల్ డ్రింక్స్, కాఫీతో పాటు పలు రకాల శాకాహార, మాంసాహార వంటకాలను ఏర్పాటు చేశారు. ఫుడ్‌ను చూసిన కంటెస్టెంట్లు ఆనందంతో అక్కడికి చేరుకున్నారు. బిగ్‌బాస్ అనుమతి ఇస్తేనే తింటామని అనుకుంటుండగా.. ఇన్ని సీజన్లలో వచ్చిన కంటెస్టెంట్లలో మీరే భయస్తులంటూ బిగ్‌బాస్ వ్యాఖ్యానించారు. దీంతో రాంప్రసాద్ తాము భయస్తులు కాదని నిరూపించుకుందామని చెప్పగా, త్రిగుణ్ ముందుగా ఫుడ్ తిన్నాడు. ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్లు కూడా తిన్నారు.
ఫుడ్ టెంప్టేషన్‌ను ఆస్వాదించిన కంటెస్టెంట్లకు ఇక టెన్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్ హెచ్చరించారు. అనంతరం ముకేశ్, షాలిని, రాంప్రసాద్‌లకు సంబంధించిన సందేశాలను ఎల్‌ఈడీపై ప్రదర్శించారు. ముకేశ్ ఇంట్లో అంత శ్రద్ధగా ఉండటం లేదని, తన వాళ్లతో తప్ప మిగతా కంటెస్టెంట్లతో కలవడం లేదని సందేశంలో పేర్కొన్నారు. చిన్న విషయాలకే స్పందిస్తూ గేమ్‌పై దృష్టి కోల్పోతున్నాడని, వర్షిణితో ఉన్న సంబంధం కూడా అతడి ఆటను పక్కదారి పట్టిస్తోందని తెలిపారు. ఈ సందేశం అనంతరం ముకేశ్, వర్షిణి తమ మధ్య దూరం పెంచుకోవాలా, అసలు ఎవరు గేమ్ నుంచి పక్కదారి పడుతున్నారనే విషయంపై మాట్లాడుకున్నారు.
షాలినికి వచ్చిన సందేశంలో ఆమె ప్రశాంతత కోల్పోతుందని, మాటలు జారుతున్నాయని, ఆలస్యంగా వస్తుందని, ఇప్పటివరకు ఒక్క గేమ్ కూడా గెలవలేదని పేర్కొన్నారు. ఆమెను ‘బ్యాక్‌బిటింగ్ స్టార్’, ‘ట్రిగరింగ్ క్వీన్’ అంటూ విమర్శించారు. ఇక రాంప్రసాద్ నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇతరులపై ఆధారపడుతూ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని సందేశం వచ్చింది. ‘నేను కన్నింగా?’ అంటూ రాంప్రసాద్ స్పందించాడు. మరోవైపు త్రిగుణ్, వంశీ షాలినిపై వ్యాఖ్యలు చేయగా ముకేశ్, వర్షిణి వైపు చూస్తూ అక్కడ ‘డైవర్షన్ గేమ్’ నడుస్తోందని వ్యాఖ్య వినిపించింది. చివర్లో అసలైన టెన్షన్ ఏంటో తెలుసుకునే సమయం వచ్చిందని బిగ్‌బాస్ చెప్పడంతో ప్రోమో ముగిసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!