

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వీకెండ్ ఎపిసోడ్‌కు సంబంధించిన 62వ రోజు ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. గత ఐదు రోజుల పాటు హౌస్‌లో జరిగిన పరిణామాలపై హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లను ప్రశ్నించారు. ముఖ్యంగా నామినేషన్ల సమయంలో వంశీ చేసిన వ్యాఖ్యలపై ఆయన నిలదీశారు. మొదట వంశీ కుండను పగలగొట్టిన నాగార్జున్.. సుధీర్‌ను వంశీ అన్న మాటల గురించి అడిగారు. అనంతరం వర్షిణిని ప్రశ్నిస్తూ, మూలన కూర్చుని ఇద్దరు కులుకుతున్నారంటూ వంశీ చేసిన వ్యాఖ్యకు అర్థమేంటని అడిగారు. అది అసభ్యకరమైన వ్యాఖ్యగా తనకు అర్థమైందని వర్షిణి చెప్పడంతో.. ఆ అర్థం నిజంగా తెలుసా? లేక ఆమె అలా అనుకుంటోందా? అని నాగార్జున్ మరోసారి ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ప్రదర్శించి కంటెస్టెంట్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు థర్మోకోల్ బాల్స్ టాస్క్ సమయంలో ముఖేష్‌పై దెబ్జానీ చేసిన వ్యాఖ్యలపై కూడా నాగార్జున్ తీవ్రంగా స్పందించారు. తన ఆటకు ఎన్ని మార్కులు ఇస్తావని అడగగా, కెప్టెన్ కాలేకపోయినందుకు మైనస్ 2 ఇస్తానని దెబ్జానీ చెప్పింది. అనంతరం ముఖేష్‌తో జరిగిన వాగ్వాదంలో ఆమె ఉపయోగించిన అభ్యంతరకరమైన పదజాలానికి సంబంధించిన వీడియోను నాగార్జున్ చూపించారు. ఆటలో ఆవేశం ఎప్పుడూ ప్రవర్తనను నియంత్రించకూడదని సూచించారు. కాళీమాతలా ధైర్యంగా ఆట ఆడాలని, అయితే తప్పుడు పదజాలానికి దూరంగా ఉండాలని హితవు పలికారు. ముఖేష్‌పై దెబ్జానీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!