

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ కొనసాగుతోంది. మంగళవారం ఎపిసోడ్‌లో నరేశ్, శ్వేత, వంశీ కుటుంబ సభ్యులు హౌస్‌లోకి రావడంతో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఇక బుధవారం ఎపిసోడ్‌లో ఎమోషన్‌తో పాటు ప్రేమకు సంబంధించిన ప్రత్యేక ఘట్టం చోటుచేసుకోనుంది. హౌస్‌లోనే ఓ ప్రేమజంట నిశ్చితార్థం చేసుకోబోతుండటంతో ఈ ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు.
బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో పాల్గొని టాప్-5 వరకు చేరుకున్న సీరియల్ నటి ప్రియాంక జైన్.. ఈసారి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా పాల్గొంటున్న తన ప్రియుడు శివ్‌ను కలిసేందుకు హౌస్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా షో చరిత్రలో తొలిసారిగా బిగ్‌బాస్ ఇంట్లోనే తాము నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. హౌస్‌మేట్స్ అందరూ కలిసి ప్రియాంక, శివ్‌ల నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. గతంలో 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షోలోనూ త్వరలో పెళ్లి చేసుకుంటామని చెప్పింది. అయితే తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించని ఈ జంట, ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో నిశ్చితార్థంతో వార్తల్లో నిలిచింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!