

బిగ్‌బాస్ తెలుగు 10లో పదో వారానికి సంబంధించిన నామినేషన్లు సోమవారం పూర్తయ్యాయి. కెప్టెన్ వంశీ మినహా మిగిలిన హౌస్మేట్స్ అందరూ నామినేషన్లలో ఉన్నారు. గతంలో ప్రకటించినట్లుగానే 65వ రోజు ఫ్యామిలీ వీక్ ప్రారంభమైంది. తొలుత బిగ్‌బాస్ స్కూల్ టాస్క్ నిర్వహించాడు. ఇందులో శ్వేత, నీతూ, దేబ్జానీ, వర్షిణి, నరేశ్ టీచర్లుగా, మిగిలినవారు విద్యార్థులుగా నటించారు. నరేశ్ ఇంగ్లీష్ క్లాస్‌తో అందరినీ నవ్వించాడు. ఆ తర్వాత నరేశ్ సోదరుడు సురేశ్ హౌస్‌లోకి వచ్చి అతడికి కొన్ని సలహాలు ఇచ్చాడు. దేబ్జానీతోనూ మాట్లాడాడు. ఇతరుల కోసం తన అవకాశాన్ని త్యాగం చేస్తూ, తీసుకున్న నిర్ణయంపై నిలబడినందుకు నరేశ్ కుటుంబ సభ్యులను ముందుగా హౌస్‌లోకి పంపించినట్లు బిగ్‌బాస్ వివరించాడు. అనంతరం సురేశ్‌కు ఫుడ్ రింగ్ టాస్క్ ఇచ్చాడు.
ఆ తర్వాత శ్వేత అక్క, తండ్రి హౌస్‌లోకి వచ్చారు. తండ్రిని చూడగానే శ్వేత హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. శ్వేతకు త్రిగుణ్ అందిస్తున్న మద్దతు గురించి ఆమె తండ్రి అతడితో మాట్లాడారు. అనంతరం వంశీ కూతురు ఆర్య శ్రీపాద హౌస్‌లోకి రావడంతో తండ్రీకూతుళ్లు భావోద్వేగానికి గురయ్యారు. కూతురి కోసం వంశీ స్వయంగా వంట చేసి కెప్టెన్ గదికి తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత వంశీ భార్య కూడా హౌస్‌లోకి రావడంతో అతడు మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన భర్తకు మద్దతుగా నిలుస్తున్న త్రిగుణ్‌కు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. త్రిగుణ్ కూడా వంశీ కూతురితో సరదాగా గడిపాడు. చివర్లో వంశీ భార్య, కూతురికి కూడా బిగ్‌బాస్ ఫుడ్ రింగ్ టాస్క్ ఇచ్చాడు. ఇలా కుటుంబ సభ్యుల రాకతో భావోద్వేగాలు, ఆనందం కలగలిసిన 65వ రోజు ఎపిసోడ్ ముగిసింది. బుధవారం కూడా ఫ్యామిలీ వీక్ కొనసాగనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!