

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఐదో వారం ‘రోడ్ టు రీలోడ్’ టాస్కులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ టాస్కులో అమన్, త్రిగుణ్ ఎండిపోయిన చెట్టు నుంచి విరబూసిన చెట్టు మీదకు చేరుకుని సేఫ్ అయ్యారు. లీడర్‌బోర్డులో 220 పాయింట్లతో రామ్ ప్రసాద్, నరేష్ అగ్రస్థానంలో ఉండగా, 200 పాయింట్లతో చరణ్, అపూర్వ తర్వాతి స్థానంలో ఉన్నారు. 160 పాయింట్లతో ముకేష్, ఝాన్సీ.. 140 పాయింట్లతో షాలినీ, రోహిత్ ఉన్నారు. తాజాగా విడుదలైన ప్రోమోను బట్టి షాలినీ, అపూర్వలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరా వీకెండ్ ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, డబుల్ ఎలిమినేషన్ ఉంటాయనే ప్రచారం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఎలిమినేషన్‌పై తుది స్పష్టత ఎపిసోడ్‌లోనే రానుంది.
తాజా ప్రోమోలో ‘ఫ్లిప్ చెయ్.. ఫేస్ చెయ్’ టాస్కులో కంటెస్టెంట్లకు వివిధ సవాళ్లు ఎదురయ్యాయి. మొదట ముకేష్‌కు ఐదు రకాల వింత చేష్టలు చేయాలనే టాస్క్ రావడంతో ముఖ కవళికలు, జుట్టుతో హాస్యాస్పదంగా ప్రవర్తించి అలరించాడు. అనంతరం అపూర్వకు వచ్చిన టాస్కులో ఇంటి సభ్యులంతా కలిసి ఒకరిని ఆట నుంచి తప్పించేందుకు ఎంపిక చేయాల్సి వచ్చింది. దీంతో ఎక్కువ మంది అపూర్వ పేరును సూచించారు. తననే ఎందుకు ఎంపిక చేశారని ఆమె ప్రశ్నించగా, అత్యధిక ఓట్లు ఆమెకే వచ్చాయని దేబ్జానీ సమాధానమిచ్చింది. మరోవైపు నరేష్‌కు డైస్‌ను దొర్లించి అత్యధిక సంఖ్య వచ్చిన వ్యక్తిని ఎలిమినేషన్‌కు ఎంపిక చేసే టాస్క్ వచ్చినట్లు ప్రోమోలో కనిపించింది. ఈ పరిణామాలతో హౌస్‌లో ఉత్కంఠ పెరిగింది. అయితే ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఆట నుంచి తప్పుకుంటారనే విషయం ఎపిసోడ్‌లోనే తేలనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!