ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌లోని పోలీస్ స్టేషన్లపై బాంబు దాడులకు సంబంధించిన ప్రశ్నను అమితాబ్ అడిగారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై అమితాబ్, సోనీ టీవీకి న్యాయపరమైన నోటీసులూ వెళ్లాయి. అయితే, ఈ వీడియో అసలు కేబీసీ ఎపిసోడ్‌కు చెందినది కాదని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అసలైన వీడియోలో అమితాబ్ అలాంటి ప్రశ్న ఏదీ అడగలేదని తెలుస్తోంది.
నకిలీ వీడియోలో రూ.12.5 లక్షల ప్రశ్నగా పంజాబ్ రాష్ట్రం గురించి అమితాబ్ అడిగినట్లు ఉంది. ‘ఏ రాష్ట్రంలో నేరస్థులు పోలీస్ స్టేషన్లలో బాంబు పేలుళ్లు జరపడానికి భయపడటం లేదు?’ అని ఆయన ప్రశ్న అడిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. నాలుగు రాష్ట్రాల పేర్లను ఆప్షన్లుగా చూపించగా.. పంజాబ్‌ను సరైన సమాధానంగా ప్రకటించినట్లు ఉంది. అయితే, ఈ దృశ్యాలు 2022లో ప్రసారమైన కేబీసీ సీజన్ 14లోని 58వ ఎపిసోడ్ నుంచి తీసుకున్నవని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్‌లో రూ.12.5 లక్షలకు అడిగిన అసలు ప్రశ్న ప్రముఖ చిత్రకారిణి అమృతా షేర్‌గిల్ గురించి. బుడాపెస్ట్‌లో జన్మించిన ఆమె తల్లి హంగేరియన్ కాగా, తండ్రి భారతీయుడు. బాంబు దాడులకు సంబంధించిన ప్రశ్న అసలు ఎపిసోడ్‌లో లేదు. అమితాబ్ స్వరాన్ని కూడా ఏఐ సాయంతో రూపొందించినట్లు తెలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!