18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 డే 11: హౌస్‌లో చరణ్ గ్రాండ్ రీఎంట్రీ...రోహిత్‌తో స్నేహానికి త్రిగుణ్ ప్రయత్నం.

Writer: Pooja 05:42 AM, 18 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 డే 11: హౌస్‌లో చరణ్ గ్రాండ్ రీఎంట్రీ...రోహిత్‌తో స్నేహానికి త్రిగుణ్ ప్రయత్నం.

బిగ్‌బాస్ తెలుగు 10లో 11వ రోజు ఎపిసోడ్‌ ఫుల్ జోష్‌తో ప్రారంభమైంది. రోహిత్‌తో విభేదాలను పక్కనపెట్టి త్రిగుణ్ సంధికి ప్రయత్నించాడు. రోహిత్‌ను స్ట్రాంగ్ ప్లేయర్‌గా అభివర్ణించిన త్రిగుణ్ తామిద్దరం కలిసి ఆడితే ఇతరులను ఎదుర్కోవడం సులభమవుతుందని చెప్పాడు. ఈ వారం ఒకరిపై ఒకరు వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకుండా కలిసి ముందుకు వెళ్లాలని ప్రతిపాదించాడు. అనంతరం కెప్టెన్సీ రేసులో భాగంగా రాం ప్రసాద్, దేబ్జానీ, త్రిగుణ్ పోటీ పడగా.. త్రిగుణ్ ముందుగా టాస్క్ పూర్తి చేసి విజయం సాధించాడు.

ఇదిలా ఉండగా, హౌస్‌లో వంశీ ప్రవర్తనపై రోహిత్, షాలిని, సృష్టి చర్చించుకున్నారు. వంశీ గతంతో పోలిస్తే చాలా మారిపోయినట్లు కనిపిస్తున్నాడని షాలిని వ్యాఖ్యానించింది. మరోవైపు, వంశీ చేసిన వ్యాఖ్యలతో వర్షిణి బాధపడి కన్నీళ్లు పెట్టుకుంది. వంట కోసం నూనె వినియోగంపై జరిగిన చర్చలో వంశీ మాట్లాడిన తీరు తనను బాధించిందని ఆమె చెప్పింది. దీంతో హౌస్‌లో కొంతసేపు భావోద్వేగ వాతావరణం నెలకొంది.

ఎపిసోడ్‌లో మరో కీలక ట్విస్ట్‌గా చరణ్ రీఎంట్రీ ఇచ్చాడు. రాక్షసుల గెటప్‌లో వచ్చిన వ్యక్తి ముసుగు తొలగించగానే చరణ్ కనిపించడంతో హౌస్‌మేట్స్ ఆశ్చర్యపోయారు. తొలివారంలో ఎలిమినేట్ అయిన చరణ్‌కు ప్రేక్షకుల ఓట్ల ద్వారా మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం లభించింది. ఇది తనకు రెండో అవకాశం అని, ఇకపై కొత్త చరణ్‌ను చూస్తారని అతను చెప్పాడు. బయట నుంచి గేమ్‌ను చూసి వచ్చినందున హౌస్‌లో ఎవరి వద్ద ఎలాంటి బలం ఉందో వెల్లడించొద్దని బిగ్‌బాస్ అతడిని హెచ్చరించారు.

ఇక త్రిగుణ్‌కు బిగ్‌బాస్ ప్రత్యేక పవర్ ఇచ్చారు. హౌస్‌లో ఉన్న వారిలో ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తప్పించే అవకాశం లేదా ఇప్పటికే కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచిన వారిలో ఒకరితో ఛాలెంజ్ చేసి కంటెండర్‌గా నిలిచే అవకాశం ఇచ్చారు. చరణ్ రెండో ఆప్షన్‌ను ఎంచుకుని త్రిగుణ్‌తో ఛాలెంజ్‌కు సిద్ధమయ్యాడు. త్రిగుణ్‌ను కెప్టెన్సీ రేసు నుంచి తప్పించడమే తన లక్ష్యమని చెప్పాడు. అయితే బిగ్‌బాస్ సూచించిన నిబంధనలను చరణ్ పూర్తిగా పాటించకపోవడంతో త్రిగుణ్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో త్రిగుణ్ తన కెప్టెన్సీ కంటెండర్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?

బిగ్ బాస్ తెలుగు 10 డే 11 ప్రోమో 2 విడుదల

బిగ్ బాస్ తెలుగు 10 డే 11 ప్రోమో 2 విడుదల

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి

బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10త్రిగుణ్చరణ్ రీ ఎంట్రీరోహిత్కెప్టెన్సీ టాస్క్బిగ్ బాస్ తెలుగు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం
జనరల్

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 11: హౌస్‌లో చరణ్ గ్రాండ్ రీఎంట్రీ...రోహిత్‌తో స్నేహానికి త్రిగుణ్ ప్రయత్నం.
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 11: హౌస్‌లో చరణ్ గ్రాండ్ రీఎంట్రీ...రోహిత్‌తో స్నేహానికి త్రిగుణ్ ప్రయత్నం.

శుక్రవారం లక్ష్మీ పూజలో పాటించాల్సిన నియమాలివే...
జనరల్

శుక్రవారం లక్ష్మీ పూజలో పాటించాల్సిన నియమాలివే...

నేటి పంచాంగంలో తెలుసుకోవాల్సిన విశేషాలివే
జనరల్

నేటి పంచాంగంలో తెలుసుకోవాల్సిన విశేషాలివే

నేటి రాశిఫలాలు: ఏ రాశికి అదృష్టం కలిసొస్తుంది?
జనరల్

నేటి రాశిఫలాలు: ఏ రాశికి అదృష్టం కలిసొస్తుంది?

అమెరికా సంస్థలో భారీ లేఆఫ్స్
జనరల్

అమెరికా సంస్థలో భారీ లేఆఫ్స్

ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం
జనరల్

ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం

IND vs AFG: టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
క్రీడలు

IND vs AFG: టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు - సీఎం రేవంత్
జనరల్

డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు - సీఎం రేవంత్

IND vs AFG - టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ కొట్టిన అభిషేక్‌
క్రీడలు

IND vs AFG - టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ కొట్టిన అభిషేక్‌

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు
జనరల్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!