26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?

Writer: Pooja 11:08 PM, 26 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తాజా ఎపిసోడ్‌ గత రోజు జరిగిన ముఖేష్ కెప్టెన్సీ విజయం నుంచి ప్రారంభమైంది. కెప్టెన్‌గా గెలిచిన ముఖేష్‌కు బిగ్ బాస్ మెడల్ అందించారు. కొత్తగా ఇంట్లోకి వచ్చిన మిథిలేష్ తన అగ్నిపరీక్ష బ్యాచ్ సభ్యులతో కలిసి ముఖేష్ ఆటతీరుపై చర్చిస్తూ.. అతను స్టార్ ప్లేయర్ కాదని అన్నాడు. రోహిత్ కూడా అతని మాటలకు మద్దతు ఇచ్చాడు. మరోవైపు అపూర్వ.. సృష్టి చేసిన పనుల గురించి సుధీర్‌తో మాట్లాడి, అనంతరం సృష్టితో నేరుగా చర్చించింది. తర్వాత ఇంటి సభ్యులు సరదాగా తమ ప్రేమకథలు, కామెడీ సంఘటనలను పంచుకున్నారు.

అనంతరం నాగార్జున ఇంట్లోకి వచ్చి ముందుగా సృష్టిని కన్ఫెషన్ రూమ్‌కు పిలిచారు. సుధీర్ నెత్తిపై చెత్త వేసిన ఘటనపై ఆమెను ప్రశ్నించారు. తన గతంలోని చేదు అనుభవాలు గుర్తుకు రావడంతోనే సుధీర్ విషయంలో భావోద్వేగంగా స్పందించానని సృష్టి చెప్పింది. అయితే సుధీర్‌తో ఆమె మాట్లాడిన వీడియోను చూపించిన నాగార్జున.. అతని మాటలను సరదాగా తీసుకున్నట్లు చెప్పిన తర్వాత ఎందుకు అంత తీవ్రంగా స్పందించావని ప్రశ్నించారు. అనంతరం సుధీర్‌ను కూడా కన్ఫెషన్ రూమ్‌కు పిలవగా.. సృష్టి తొలుత తన వివరణను అంగీకరించిందని, ఆ తర్వాత రోహిత్, త్రిగుణ్ ప్రభావంతో తనపై టార్గెట్ పెట్టిందని చెప్పాడు. ఈ విషయంలో సుధీర్ తప్పేమీ లేదని నాగార్జున తెలిపారు.

ఇక పలువురు కంటెస్టెంట్ల ఆటతీరు, ప్రవర్తనపై నాగార్జున క్లాస్ తీసుకున్నారు. నరేష్‌తో జరిగిన బజర్ టాస్కులో వంశీనే గెలిచాడని వీడియో ద్వారా స్పష్టం చేశారు. నరేష్‌కు అన్యాయం జరగలేదని చెబుతూనే, అతని ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రశంసించారు. అమన్, రోహిత్ చేసిన వ్యాఖ్యలపై కూడా నాగార్జున ప్రశ్నలు సంధించారు. టాస్కుల్లో లింగ భేదాలకు చోటు లేదని, ఎవరైనా ఇబ్బంది పడితే సంచాలక్‌కు చెప్పాలని కంటెస్టెంట్లకు సూచించారు. రోహిత్ ఒక చోట మాట్లాడిన విషయాలను మరో చోట చెప్పడంపై కూడా నాగార్జున ప్రశ్నించారు. నామినేషన్స్‌లో ఉన్నవారిలో సుధీర్, ఆ తర్వాత షాలినీ సేవ్ అయ్యారు.

అనంతరం ఇంట్లోకి వచ్చిన నాగార్జున ఓ సూట్‌కేస్‌లో నగదు ఉంచి కంటెస్టెంట్లకు భారీ ఆఫర్ ఇచ్చారు. మొదట ₹5 లక్షలు ఇస్తామని, డబ్బు తీసుకుని ఎవరైనా ఇంటి నుంచి వెళ్లిపోవచ్చని చెప్పారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో మొత్తాన్ని ₹10 లక్షలకు, ఆ తర్వాత ₹15 లక్షలకు పెంచారు. దీంతో ఇటీవలే ఇంట్లోకి వచ్చిన మిథిలేష్ డబ్బు తీసుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అతన్ని ఒప్పించేందుకు ఇంటి సభ్యులకు అవకాశం ఇచ్చినా మిథిలేష్ తన నిర్ణయంపై నిలబడ్డాడు. అనంతరం ఇంటి సభ్యులతో ఓటింగ్ నిర్వహించగా.. మిథిలేష్ వారిని ఒప్పించాడు. దీంతో సూట్‌కేస్ తీసుకుని ఇంటి నుంచి బయటకు రావాలని నాగార్జున చెప్పాడు. మిథిలేష్ నిజంగానే ఇంటి నుంచి బయటకు వచ్చాడా లేదా అనేది తదుపరి ఎపిసోడ్‌లో తేలనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్

బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్

బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్

బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్

బిగ్‌బాస్ తెలుగు డే 19 ఎపిసోడ్ 20 రివ్యూ.. ముఖేష్ కెప్టెన్, అపూర్వకు ఇమ్యూనిటీ !

బిగ్‌బాస్ తెలుగు డే 19 ఎపిసోడ్ 20 రివ్యూ.. ముఖేష్ కెప్టెన్, అపూర్వకు ఇమ్యూనిటీ !

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌

బిగ్ బాస్ త్రిగుణ్‌ చిన్నప్పటి ఫొటో వైరల్‌.. గుర్తుపట్టారా?

బిగ్ బాస్ త్రిగుణ్‌ చిన్నప్పటి ఫొటో వైరల్‌.. గుర్తుపట్టారా?

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ తెలుగు 10నాగార్జునమిథిలేష్ముఖేష్బిగ్ బాస్ అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈసీ స్పష్టతపై చంద్రబాబు స్పందన
జనరల్

ఈసీ స్పష్టతపై చంద్రబాబు స్పందన

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ
సినిమాలు

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్
సినిమాలు

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి - రేవంత్ రెడ్డి
జనరల్

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి - రేవంత్ రెడ్డి

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా
సినిమాలు

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా

హైదరాబాద్ రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా
జనరల్

హైదరాబాద్ రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ
బిజినెస్

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ
జనరల్

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ

అస్సాంలో సర్ బాధితులను కలవనున్న అశుతోష్ రంకా
జనరల్

అస్సాంలో సర్ బాధితులను కలవనున్న అశుతోష్ రంకా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!