7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం

Writer: Pooja 11:35 PM, 6 అక్టోబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం

బిగ్‌బాస్‌ తెలుగు ఇంట్లో ఐదో వారం నామినేషన్‌ ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ మధ్య సాగింది. నామినేషన్లు పూర్తయ్యే సరికి అగ్ని పరీక్ష టీమ్‌ మొత్తం డేంజర్‌ జోన్‌లోకి వచ్చింది. తన టీమ్‌లోని అందరూ నామినేషన్లలో ఉంటే, వారిలో ఒకరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందని రోహిత్‌ ముందుగానే అంచనా వేశాడు. అందుకే సెలెబ్రిటీ గ్యాంగ్‌ నుంచి వీలైనంత ఎక్కువ మందిని నామినేషన్లలోకి తీసుకురావాలని తన టీమ్‌కు సూచించాడు. రోహిత్‌ వ్యూహాన్ని నరేష్‌ కూడా ముందుగానే గుర్తించడంతో సెలెబ్రిటీ టీమ్‌ అతడిని అభినందించింది.

రోహిత్‌ ప్లాన్‌ ప్రకారం అగ్ని పరీక్ష టీమ్‌ సభ్యులు ప్రత్యర్థి టీమ్‌ నుంచి పలువురిని నామినేట్‌ చేశారు. పాయింట్లు ఉన్నా లేకపోయినా నామినేషన్లు చేయడంతో చివరకు కెప్టెన్‌ వర్షిణి, ఇమ్యూనిటీ సాధించిన వంశీ, సుధీర్‌ మినహా మిగతా సభ్యులంతా నామినేషన్‌ జాబితాలోకి వచ్చారు. దీంతో ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారింది.

సుధీర్‌ రహిత్‌, షాలినీని నామినేట్‌ చేస్తూ వారు మాటలు జారుతున్నారని, సైగలు చేస్తున్నారని పాయింట్లు చెప్పాడు. రోహిత్‌ ప్రభావం వల్ల షాలినీ గేమ్‌ దెబ్బతింటోందని, రాత్రి ఆలస్యంగా ఇద్దరూ కూర్చొని మాట్లాడుతున్నారని సుధీర్‌ వ్యాఖ్యానించాడు. దీనిపై షాలినీ స్పందిస్తూ అది వ్యక్తిగత విషయం అంటూ సుధీర్‌ను ప్రశ్నించింది. మధ్యలో నవ్వుతున్న సెలెబ్రిటీ టీమ్‌పై కూడా షాలినీ కౌంటర్లు వేయడంతో వాతావరణం వేడెక్కింది. పవర్‌ ఆఫ్‌ పీపుల్స్‌ వీక్‌లో వంశీ కనిపించలేదన్న షాలినీ వ్యాఖ్యలతో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. త్రిగుణ్‌ కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకోవడంతో గొడవ మరింత ముదిరింది.

ఆ తర్వాత చరణ్‌ ముకేష్‌ను నామినేట్‌ చేస్తూ ఆచితూచి మాట్లాడాలని సూచించాడు. దీనికి ముకేష్‌ వ్యంగ్యంగా స్పందించాడు. అనంతరం అపూర్వ.. ముకేష్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అతడిని నామినేట్‌ చేసింది. ఈ సందర్భంగా “నువ్వు తోపు అయితే నీకు నేను బాపు” అంటూ అపూర్వ వ్యాఖ్యానించగా, “నువ్వు నాకు బాపు? తండ్రివా?” అంటూ ముకేష్‌ కౌంటర్‌ ఇచ్చాడు. దీంతో నామినేషన్‌ ప్రక్రియలో మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సస్పెన్స్‌తో ‘ది ట్రైటర్స్‌ తెలుగు’ అధికారిక ట్రైలర్‌ విడుదల

సస్పెన్స్‌తో ‘ది ట్రైటర్స్‌ తెలుగు’ అధికారిక ట్రైలర్‌ విడుదల

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

ట్యాగ్లు
బిగ్‌బా తెలుగు 10బిగ్‌బా నామినేషన్స్బిగ్‌బా తెలుగురోహిత్షాలినీతెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 2 వచ్చేసింది.. హౌస్‌లో ఏం జరగబోతోంది?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 2 వచ్చేసింది.. హౌస్‌లో ఏం జరగబోతోంది?

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్‌ గేమ్ మొదలైందా?

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్‌ గేమ్ మొదలైందా?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం
జనరల్

లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన
జనరల్

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ
జనరల్

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం
జనరల్

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన
క్రీడలు

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
క్రీడలు

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌
క్రీడలు

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌

‘శాంతి’ వ్యాఖ్యలపై సంజయ్‌ దత్‌ వివరణ
సినిమాలు

‘శాంతి’ వ్యాఖ్యలపై సంజయ్‌ దత్‌ వివరణ

షారుఖ్‌ ఖాన్‌ ‘మన్నత్‌’లో కఠినమైన నిబంధనలు
సినిమాలు

షారుఖ్‌ ఖాన్‌ ‘మన్నత్‌’లో కఠినమైన నిబంధనలు

బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌
క్రీడలు

బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!