

బిగ్ బాస్ తెలుగు 10 డే 17 ప్రోమోలో వంశీ, త్రిగుణ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. గతంలో వంటగదిలో పని చేస్తున్న సమయంలో మాట్లాడినందుకు నాగార్జున్ వారిద్దరినీ హెచ్చరించి, ఒక రోజు నోటికి ప్లాస్టర్ వేసుకుని మాట్లాడకుండా ఉండాలని పనిష్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కెప్టెన్ ఝాన్సీ ఆ విషయాన్ని గుర్తు చేస్తూ వంట చేసేటప్పుడు మాట్లాడొద్దని వారిని హెచ్చరిస్తుంది. ప్లాస్టర్ వేసుకోవాలని వంశీ చెప్పగా, బిగ్ బాస్ ప్లాస్టర్ ఇవ్వడం లేదని ఝాన్సీ చెబుతుంది. అయితే ప్లాస్టర్ లేకపోతే తాము మాట్లాడుతూనే ఉంటామని త్రిగుణ్ చెప్పడంతో, బిగ్ బాస్‌ను ప్లాస్టర్ పంపించాలని ఝాన్సీ కోరుతుంది.
మరోవైపు ఈ వారం ‘టెంప్టేషన్, టెన్షన్’ థీమ్‌లో భాగంగా దేబ్జానీకి భావోద్వేగ పరిస్థితి ఎదురైంది. వర్షిణి, దేబ్జానీలో ఒకరిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ముఖేష్ దేబ్జానీని ఎంచుకోవడంతో ఆమెకు ఇంటి నుంచి వచ్చిన లెటర్ కోల్పోవడంతో పాటు కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచే అవకాశం కూడా పోయింది. లెటర్ పోవడంతో దేబ్జానీ కన్నీరు పెట్టుకోగా, ముఖేష్ తన తండ్రితో ఉన్న ఫొటోను అందుకుని సంతోషిస్తాడు. రోహిత్ లెటర్ గురించి దేబ్జానీతో మాట్లాడగా, రామ్ ప్రసాద్, నరేష్ ఆమెను నవ్వించేందుకు ప్రయత్నిస్తారు. చివరగా బిగ్ బాస్ ప్లాస్టర్ పంపించడంతో ఝాన్సీ వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్ వేస్తుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!