

బిగ్ బాస్ తెలుగు 10 మూడో వారం నామినేషన్స్‌లో సుధీర్, సృష్టి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 22 ఎపిసోడ్‌లో ఈ గొడవ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. సృష్టి సుధీర్‌ను నామినేట్ చేస్తూ, తన అవసరాల కోసం ఇతరులను ఉపయోగించుకోవద్దని ఆరోపించింది. అలాగే సుధీర్ చేసిన ‘ఫ్రీడమ్’ వ్యాఖ్యను ప్రశ్నించింది. దీనికి స్పందించిన సుధీర్.. తాను ఎప్పుడూ ఆమెతో తప్పుగా మాట్లాడలేదని చెప్పడంతో పాటు, గతంలో తనపై చేసిన కఠిన వ్యాఖ్యలను గుర్తు చేశాడు. ‘ఫ్రీడమ్’ అనే మాటను తాను తన ఆటపై మరింత ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో చెప్పానని, ఎవరినీ అవమానించడానికి కాదని వివరించాడు. ఈ క్రమంలో త్రిగుణ్ కూడా మధ్యలోకి రావడంతో వాగ్వాదం మరింత తీవ్రంగా మారింది.
వాగ్వాదం కొనసాగుతున్న సమయంలో సృష్టి సుధీర్‌పై చెత్తను విసిరిన సన్నివేశం కూడా ప్రోమో, ఎపిసోడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే సుధీర్ మాత్రం పరిస్థితిని ఓపికగా ఎదుర్కొంటూ తన వాదనను వివరించే ప్రయత్నం చేశాడు. మరోవైపు ఇంట్లోని కొందరు కంటెస్టెంట్లు ఈ గొడవపై చర్చిస్తూ, వివాదం మరింత ముదరడానికి ఇతరుల జోక్యం కూడా కారణమైందని అభిప్రాయపడ్డారు. ఎపిసోడ్ ప్రసారమైన తర్వాత సోషల్ మీడియాలో సుధీర్‌కు మద్దతుగా పలువురు నెటిజన్లు స్పందించారు. ఈ ఘటనతో కంటెస్టెంట్ల ప్రవర్తన, నామినేషన్స్‌లో జరుగుతున్న గొడవలపై మరోసారి చర్చ మొదలైంది.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!