
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 3,967 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ నామినేషన్లను సమర్పించవచ్చు. పది వేల మందికి పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో ఒక నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఎన్నికల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.
జిల్లాల వారీగా చూస్తే తొలి విడతలో అత్యధికంగా తిరుపతి జిల్లాలో 404 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 66 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభంతో రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ఊపందుకోనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!