

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభమైన కొద్దిరోజులకే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో ప్రేక్షకులకు షాక్ తగలడంతో.. ఇకపై మరికొందరు సెలబ్రిటీలను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి తీసుకురానున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో నటి సురేఖా వాణి కుమార్తె, నటి సుప్రీతా నాయుడు పేరు కూడా సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపించింది. ఈ వార్తలపై తాజాగా స్పందించిన సుప్రీతా.. తాను ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు.
బిగ్ బాస్ పదో సీజన్ ప్రారంభానికి ముందే తనను షోలోకి రావాలని సంప్రదించినట్లు సుప్రీతా వెల్లడించారు. అయితే హౌస్‌లోకి వెళ్లిన తర్వాత తన భావోద్వేగాలను సరిగ్గా నియంత్రించుకోగలనా అనే విషయంలో తన తల్లికి ఆందోళన ఉందని తెలిపారు. తాను అసలు షోలోకి వెళ్లనప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఎలా ఎంట్రీ ఇస్తానని ఆమె ప్రశ్నించారు. తన తల్లికి ఇష్టం లేనందున ప్రస్తుతానికి బిగ్ బాస్‌లోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే తాను బిగ్ బాస్ కార్యక్రమానికి పెద్ద అభిమానినని, షోను ఎంతో ఆసక్తిగా చూస్తానని సుప్రీతా తెలిపారు. దీంతో ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీపై వస్తున్న ప్రచారానికి ప్రస్తుతానికి తెరపడినట్లయింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!