

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొలి వారంలోనే ఊహించని డబుల్ ఎలిమినేషన్‌తో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో చరణ్ బయటకు వెళ్లగా.. తాజాగా రెండో మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో చైత్ర రాయ్ కూడా హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఎపిసోడ్ ప్రారంభంలో హౌస్‌మేట్స్ మద్దతుతో రామ్ ప్రసాద్ హై రిస్క్ జోన్ నుంచి సేవ్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. మరోవైపు త్రిగుణ్ తన మైండ్ గేమ్స్ కొనసాగిస్తూ అమన్ మసూద్‌తో రోహిత్ గురించి చర్చించాడు. అగ్నిపరీక్షలో రోహిత్ తనపై అరవడం వల్లే అతనికి హైలైట్ అయ్యే అవకాశం వచ్చిందంటూ అమన్‌కు చెప్పాడు. ఇకపై ఇంట్లో జరిగే ప్రతి ఆట కీలకమని, టీమ్‌లు ఉండవని, ప్రతి ఒక్కరూ తమ ఆటను తామే ఆడాలని బిగ్ బాస్ స్పష్టం చేశారు.
హౌస్‌మేట్‌గా మారేందుకు ‘ఈజీ టాస్క్’, ‘హార్డ్ టాస్క్’ అనే రెండు మార్గాలను బిగ్ బాస్ ఇచ్చారు. సుధీర్, వర్షిణి హార్డ్ టాస్క్‌ను ఎంచుకోగా.. మిగిలిన వారు ఈజీ టాస్క్ వైపు వెళ్లారు. ఇప్పటికే హై రిస్క్ జోన్‌లో ఉన్న చైత్ర రాయ్‌కు మాత్రం టాస్క్‌లో పాల్గొనే అవకాశం లభించలేదు. అనంతరం ఎక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. మరోవైపు దేబ్జానీ భావోద్వేగానికి గురికావడంతో రోహిత్, షాలిని ఆమెను ఓదార్చారు. త్రిగుణ్ ప్రతి విషయంలోనూ సలహాలు ఇవ్వడంపై ముఖేష్ గౌడ, సుధీర్, ఝాన్సీ అసహనం వ్యక్తం చేశారు. గిన్నెలు కడిగే విషయంలో రోహిత్‌తో త్రిగుణ్ మరోసారి వాగ్వాదానికి దిగాడు. ‘రన్ రాజా రన్’ టాస్క్‌లోనూ అతని నిర్ణయాలు చర్చకు దారితీశాయి. ఈ టాస్క్‌లో రామ్ ప్రసాద్ విజేతగా నిలిచాడు. తొలి వారంలోనే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ హౌస్‌లో టెన్షన్ మరింత పెరిగింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!