
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలవడంతో కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. టీవీ తారలు, కమెడియన్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా ప్రముఖ యాంకర్, నటి వర్షిణి సౌందర రాజన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ‘ఢీ’ వంటి షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్ నుంచి వర్షిణి పేరు ప్రతి ఏడాది ప్రచారంలోకి వస్తున్నప్పటికీ, గతంలో డేట్స్ తదితర కారణాలతో ఆమె షోకు దూరంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈసారి నిర్వాహకులు సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బలమైన ప్రచారం జరుగుతోంది. సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా ఆమె ఎంట్రీ దాదాపు ఖరారైందనే టాక్ వినిపిస్తున్నా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!