23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10 డే 77: ఇంటి నుంచి నీతూ ఎలిమినేట్.. కెప్టెన్సీ కంటెండర్లుగా ఆరుగురు

Writer: Chandrika 12:00 AM, 23 నవంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10 డే 77: ఇంటి నుంచి నీతూ ఎలిమినేట్.. కెప్టెన్సీ కంటెండర్లుగా ఆరుగురు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 77వ రోజు, 78వ ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సండే ఫండేలో భాగంగా కంటెస్టెంట్ల మధ్య వివిధ టాస్కులు నిర్వహించడంతో పాటు, రష్మిక మందన్న సందడి చేశారు. 11వ వారం ముగింపు సందర్భంగా నీతూ ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఇక 12వ వారం ‘బడ్డీ అప్’ అనే థీమ్‌తో సాగుతుందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. మరోవైపు, వచ్చే వారం కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచే ఆరుగురు కంటెస్టెంట్లు కూడా ఈ ఎపిసోడ్‌లో ఖరారయ్యారు.

మొదట దేబ్జానీ, త్రిగుణ్ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అనంతరం వంశీ, త్రిగుణ్ మధ్య రోప్ టాస్క్ నిర్వహించారు. దాదాపు ఎనిమిది నిమిషాలకు పైగా ఇద్దరూ పోటీపడగా.. చివరకు వంశీ టాస్క్‌ను వదిలేశాడు. దీంతో త్రిగుణ్ విజయం సాధించాడు. ఇద్దరి ప్రయత్నాన్ని నాగార్జున అభినందించారు. ఈ టాస్క్ ఎంత కష్టమో తనకు తెలుసని, ఎనిమిది నిమిషాలకు పైగా ఆడటం గొప్ప విషయమని ప్రశంసించారు. సంచాలక్‌గా ఉన్న వర్షిణిని కూడా టాస్క్ ప్రయత్నించమని కోరగా.. ఆమె సుమారు నిమిషం పాటు కొనసాగించింది.

మైసా సినిమా ప్రమోషన్లలో భాగంగా నటి రష్మిక మందన్న స్టేజ్‌పైకి వచ్చి సందడి చేశారు. కంటెస్టెంట్లకు సినిమా డైలాగులు వినిపించి, అవి ఏ చిత్రానికి చెందినవో గుర్తించడంతో పాటు డ్యాన్స్ చేయించే సరదా కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి ప్రదర్శనలకు రష్మిక మార్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా ముకేష్ కన్నడలో ఆమెతో మాట్లాడగా.. శివ్ కూడా కన్నడలోనే రష్మికను ప్రశంసించాడు. అనంతరం రష్మిక చేతుల మీదుగా ముకేష్, వంశీ సేఫ్ అయ్యారు. ఇతర టాస్కుల్లో నరేష్‌పై రాం ప్రసాద్ విజయం సాధించగా, అమన్‌తో పోటీపడిన శివ్ గెలిచాడు. దేబ్జానీ, నీతూ మధ్య జరిగిన టాస్క్‌లో దేబ్జానీ నెగ్గింది. ఇక సుధీర్‌తో జరిగిన పోటీలో RK గెలిచి తొలిసారి విజయం సాధించిన ఆనందాన్ని గట్టిగా వ్యక్తం చేశాడు.

చివరగా నీతూ, సుధీర్‌లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఇద్దరినీ గార్డెన్ ఏరియాకు తీసుకెళ్లి, కళ్లకు గంతలు కట్టి కారులో కూర్చోబెట్టాలని నాగార్జున సూచించారు. ఇంటి సభ్యులు తమ అంచనాలు వ్యక్తం చేయగా.. చివరకు సుధీర్ తిరిగి ఇంట్లోకి వచ్చాడు. దీంతో నీతూ ఎలిమినేట్ అయినట్లు తేలింది. స్టేజ్‌పైకి వచ్చిన నీతూ.. తాను ఇంట్లో కొనసాగాలని అనుకున్నా, తన స్వభావానికి విరుద్ధంగా అరవడం, గొడవలు పెట్టుకోవడం తన వల్ల కాలేదని చెప్పింది. తన జర్నీని చూసుకుని భావోద్వేగానికి గురైంది. ఫుల్ ట్యాంక్ కేటగిరీలో అమన్, శివ్, త్రిగుణ్ పేర్లను, ఎంప్టీ ట్యాంక్ కేటగిరీలో వంశీ, సుధీర్, ముకేష్ పేర్లను పేర్కొంది.

బయటకు వెళ్లే ముందు ముకేష్‌కు నీతూ ఓ సలహా ఇచ్చింది. ఇకనైనా తన ఆట తాను ఆడాలని, సొంత నిర్ణయాలు తీసుకోవాలని, ఇతరుల అభిప్రాయాల ప్రభావానికి లోనుకావద్దని సూచించింది. మరోవైపు, టాస్కుల్లో గెలిచి త్రిగుణ్, RK, శివ్, దేబ్జానీ, రాం ప్రసాద్, ముకేష్ 12వ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. నీతూ ఎలిమినేషన్‌తో 11వ వారం ముగియగా.. వచ్చే వారం ‘బడ్డీ అప్’ థీమ్‌తో ఆట మరింత ఆసక్తికరంగా సాగనుంది. ఈ థీమ్‌లో కంటెస్టెంట్ల ఆటతీరు ఎలా ఉండబోతోందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ కంటెండర్స్ రేసు..

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ కంటెండర్స్ రేసు..

బిగ్‌బాస్ 10 డే 77 ప్రోమో 1: బిగ్ బాస్ తెలుగు వేదికపై రష్మిక సందడి

బిగ్‌బాస్ 10 డే 77 ప్రోమో 1: బిగ్ బాస్ తెలుగు వేదికపై రష్మిక సందడి

నీతూ ఎలిమినేషన్‌పై నిజాలు బయటపెడతానంటున్న నటరాజ్

నీతూ ఎలిమినేషన్‌పై నిజాలు బయటపెడతానంటున్న నటరాజ్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 76: వర్షిణిపై వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు..నాగార్జున గట్టి వార్నింగ్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 76: వర్షిణిపై వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు..నాగార్జున గట్టి వార్నింగ్

కేబీసీ సీజన్ 18 తొలి కోటీశ్వరుడిగా భూషణ్ ఠాక్రే

కేబీసీ సీజన్ 18 తొలి కోటీశ్వరుడిగా భూషణ్ ఠాక్రే

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ డే 77నీతూ ఎలిమినేషన్నీతూ ఎగ్జిట్నాగార్జునరష్మిక మందన్నమైసా ప్రమోషన్స్త్రిగుణ్కెప్టెన్సీ కంటెండర్లుబడ్డీ అప్ థీమ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 77: ఇంటి నుంచి నీతూ ఎలిమినేట్.. కెప్టెన్సీ కంటెండర్లుగా ఆరుగురు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 77: ఇంటి నుంచి నీతూ ఎలిమినేట్.. కెప్టెన్సీ కంటెండర్లుగా ఆరుగురు

భారత్‌కు చేరుకున్న నేపాల్ ప్రధాని బాలేంద్ర షా..
జనరల్

భారత్‌కు చేరుకున్న నేపాల్ ప్రధాని బాలేంద్ర షా..

అట్లాంటా ఎయిర్‌పోర్టులో డెల్టా విమానాలకు అంతరాయం..
జనరల్

అట్లాంటా ఎయిర్‌పోర్టులో డెల్టా విమానాలకు అంతరాయం..

సారా టెండూల్కర్, రాజ్‌వీర్ డియోల్ పెళ్లి వార్తలపై జోరుగా ప్రచారం.. నిజమెంత?
గాసిప్స్

సారా టెండూల్కర్, రాజ్‌వీర్ డియోల్ పెళ్లి వార్తలపై జోరుగా ప్రచారం.. నిజమెంత?

శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ ఆరోగ్య శాఖ కీలక సూచనలు..
జనరల్

శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ ఆరోగ్య శాఖ కీలక సూచనలు..

బిస్లరీ నీటి నమూనా అసురక్షితమని FSSAI ప్రకటన..
జనరల్

బిస్లరీ నీటి నమూనా అసురక్షితమని FSSAI ప్రకటన..

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం..
జనరల్

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం..

అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి
జనరల్

అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి

వెంటిలేటర్‌పై BJP ఎమ్మెల్యే రేఖా పాత్రా..
జనరల్

వెంటిలేటర్‌పై BJP ఎమ్మెల్యే రేఖా పాత్రా..

‘భోగి’ ట్రైలర్‌లో మాస్ అవతారంలో శర్వానంద్..
సినిమాలు

‘భోగి’ ట్రైలర్‌లో మాస్ అవతారంలో శర్వానంద్..

వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు.. 90 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు.. 90 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్
రాజకీయాలు

సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!