

తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6న ఘనంగా ప్రారంభమైంది. పది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. తొలి వారంలోనే చైత్ర రాయ్, చరణ్ మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు గురికాగా, ప్రేక్షకుల అభ్యర్థన మేరకు చరణ్‌కు తిరిగి హౌస్‌లోకి వచ్చే అవకాశం లభించింది. రెండో వారంలో 11 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉండగా, కృష్ణుడు కూడా డేంజర్ జోన్‌లోకి వచ్చారు. ఆయన ఆటతీరుపై చర్చ జరుగుతుండటంతో పాటు, తాజా సోషల్ మీడియా ప్రచారంలోనూ కృష్ణుడు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే, తాజాగా కృష్ణుడు రెండో వారంలో బిగ్‌బాస్ హౌస్‌ను వీడినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. వారాంతపు ఎపిసోడ్‌లో ఆయన ఎలిమినేషన్ ప్రక్రియను ప్రసారం చేయనున్నట్లు సమాచారం. గతంలో బిగ్‌బాస్ కృష్ణుడు, సృష్టి ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వారు గత వారాంతంలో ఎలా ఆడారో ప్రేక్షకుల్లా కూర్చొని చూడాలని సూచించారు. మరోవైపు కృష్ణుడి ఆట హౌస్‌లో పెద్దగా హైలైట్ కాలేదనే చర్చ కూడా సాగింది. ఆయనకు వారానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. రెండు వారాలకు సుమారు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందుకున్నట్లు సమాచారం. అయితే ఈ రెమ్యూనరేషన్ వివరాలకు అధికారిక ధృవీకరణ లేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!