

మెగాస్టార్ చిరంజీవి తొలిసారి టాక్ షో హోస్ట్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘మెగావర్స్’ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. ఈ షోపై మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. గతంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లతో ప్రత్యేక ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ అక్కినేనిలతో మరో ప్రత్యేక ఎపిసోడ్ ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
మెగా, అక్కినేని కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా స్నేహబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అక్కినేని త్రయం చిరంజీవి టాక్ షోలో పాల్గొంటే ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అయితే, దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు చిరంజీవి ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ‘మెగావర్స్’ ప్రీమియర్ తేదీ, అతిథుల వివరాలపై త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!