5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా అధ్యక్షుడి వీటో పవర్ అంటే ఏమిటి? దాని అధికారాలు, పరిమితులివే!

Writer: Chandrika 10:00 AM, 5 నవంబర్, 2026
అమెరికా అధ్యక్షుడి వీటో పవర్ అంటే ఏమిటి? దాని అధికారాలు, పరిమితులివే!

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉండటంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొత్త సవాళ్లు ఎదురుకావచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రతినిధుల సభ, సెనెట్‌లలో డెమోక్రాట్లు ఆధిపత్యం సాధిస్తే ట్రంప్ తీసుకునే నిర్ణయాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే అధ్యక్షుడి చేతిలో ఉన్న కీలక రాజ్యాంగ అధికారమైన ‘వీటో పవర్’ ఈ పరిస్థితుల్లో ప్రాధాన్యం సంతరించుకుంటోంది. కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై సంతకం చేయకుండా దాన్ని తిరిగి పంపించడం ద్వారా అధ్యక్షుడు చట్టంగా మారకుండా అడ్డుకోవచ్చు. అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికి కల్పించిన ముఖ్యమైన కార్యనిర్వహణ అధికారాల్లో ఇది ఒకటి. సాధారణంగా ఒక బిల్లు చట్టంగా మారాలంటే ప్రతినిధుల సభ, సెనెట్ రెండూ ఆమోదించాలి. ఆ తర్వాత అధ్యక్షుడు సంతకం చేయాలి. అయితే కాంగ్రెస్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో అధ్యక్షుడు బిల్లును 10 రోజుల్లోగా (ఆదివారాలను మినహాయించి) తిరిగి పంపకపోతే అది ఆయన సంతకం లేకుండానే చట్టంగా మారుతుంది.

అయితే అధ్యక్షుడి వీటో అధికారానికి తిరుగులేదని భావించకూడదు. అధ్యక్షుడు బిల్లును తిరస్కరించినప్పటికీ, ప్రతినిధుల సభ, సెనెట్ రెండూ మూడింట రెండొంతుల మెజార్టీతో మరోసారి ఆమోదిస్తే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. వీటో అధికారాన్ని ప్రధానంగా రెండు రకాలుగా విభజించారు. మొదటిది ‘రెగ్యులర్ వీటో’. ఇందులో అధ్యక్షుడు బిల్లుపై సంతకం చేయకుండా తన అభ్యంతరాలతో కాంగ్రెస్‌కు తిరిగి పంపిస్తారు. రెండోది ‘పాకెట్ వీటో’. ఇందులో అధ్యక్షుడు బిల్లుపై సంతకం చేయరు, తిరిగి కాంగ్రెస్‌కు కూడా పంపరు. అయితే పది రోజుల గడువులోగా కాంగ్రెస్ సమావేశాలు ముగిసి, బిల్లును తిరిగి పంపడానికి అవకాశం లేకపోతే అది చట్టంగా మారదు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం అమెరికా అధ్యక్షులు ఇప్పటివరకు 2,599 సార్లు వీటో అధికారాన్ని వినియోగించుకున్నారు. ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ తన అధ్యక్ష పదవీకాలంలో అత్యధికంగా 635 సార్లు ఈ అధికారాన్ని ఉపయోగించారు. మొత్తం 38 మంది అధ్యక్షులు ఈ అధికారాన్ని వినియోగించుకున్నట్లు పేర్కొంటున్నారు. ఇలా వీటో అధికారం అమెరికా అధ్యక్షుడికి, కాంగ్రెస్‌కు మధ్య అధికార సమతౌల్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలింగ్ శాతం తగ్గొద్దు.. ఎన్డీఏ నేతలకు చంద్రబాబు కీలక సూచనలు

పోలింగ్ శాతం తగ్గొద్దు.. ఎన్డీఏ నేతలకు చంద్రబాబు కీలక సూచనలు

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

బీజేపీకి మేలు చేసేందుకే ఆప్ రాజకీయాలు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

బీజేపీకి మేలు చేసేందుకే ఆప్ రాజకీయాలు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి.. వైఎస్సార్‌సీపీ డిమాండ్

ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి.. వైఎస్సార్‌సీపీ డిమాండ్

ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం
ట్యాగ్లు
అమెరికా రాజకీయాలుడొనాల్డ్ ట్రంప్వీటో అధికారంఅమెరికా మధ్యంతర ఎన్నికలుఅమెరికా కాంగ్రెస్ప్రతినిధుల సభసెనెట్అమెరికా రాజ్యాంగంరెగ్యులర్ వీటోపాకెట్ వీటో
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం

ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగులో బజ్‌ లేకుండానే విడుదలకు సిద్ధమైన నయనతార ‘మహాశక్తి’
సినిమాలు

తెలుగులో బజ్‌ లేకుండానే విడుదలకు సిద్ధమైన నయనతార ‘మహాశక్తి’

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్‌ఇండియా
క్రీడలు

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్‌ఇండియా

యూత్‌ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన తన్వి పాత్రి..
క్రీడలు

యూత్‌ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన తన్వి పాత్రి..

వైఎస్సార్‌సీపీ శ్రేణులకు వరుదు కల్యాణి కృతజ్ఞతలు
రాజకీయాలు

వైఎస్సార్‌సీపీ శ్రేణులకు వరుదు కల్యాణి కృతజ్ఞతలు

ఉల్లిపాయల కొనుగోలుపై సీఎం విజయ్‌ను నిలదీసిన ఉదయనిధి
రాజకీయాలు

ఉల్లిపాయల కొనుగోలుపై సీఎం విజయ్‌ను నిలదీసిన ఉదయనిధి

వదోదర, ముంబయి వేదికలుగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌
క్రీడలు

వదోదర, ముంబయి వేదికలుగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌

నంద్యాలలో జనసేనకు ఎదురుదెబ్బ
రాజకీయాలు

నంద్యాలలో జనసేనకు ఎదురుదెబ్బ

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు నిరాశ..
క్రీడలు

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు నిరాశ..

అమెరికా ఎన్నికల ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్లలో జోరుగా కొనుగోళ్లు
బిజినెస్

అమెరికా ఎన్నికల ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్లలో జోరుగా కొనుగోళ్లు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లకు భారీ షాక్
జనరల్

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లకు భారీ షాక్

ఆడపిల్లల పుట్టుకను వేడుకగా మార్చుతున్న పుణె వైద్యుడు!
జనరల్

ఆడపిల్లల పుట్టుకను వేడుకగా మార్చుతున్న పుణె వైద్యుడు!

నాగ చైతన్య మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అప్‌డేట్
సినిమాలు

నాగ చైతన్య మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అప్‌డేట్