

‘బిగ్‌బాస్ తెలుగు 10’ ప్రారంభానికి ముందు సామాన్యులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ‘బిగ్‌బాస్ తెలుగు 10’కు నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. పదో సీజన్ కావడంతో ఈ షోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
శ్రీముఖి తీరుపై విమర్శలు:
‘అగ్నిపరీక్ష’కు యాంకర్‌గా వ్యవహరిస్తున్న శ్రీముఖి తీరుపై తాజాగా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ‘రన్నింగ్ రాజా’ ఓ స్కిట్‌లో శ్రీముఖిని ఇమిటేట్ చేస్తూ ఆమె మేకప్, హావభావాలను సరదాగా అనుకరించాడు. అనంతరం శ్రీముఖి వద్దకు వెళ్లగా ఆమె సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. తనను తాకితే చెంప పగలగొడతానని ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!