12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..

Writer: Chandrika 10:49 AM, 12 ఆగస్టు, 2026
చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..

తెలుగు రాష్ట్రాల నుంచి కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి, పెంటేల హరికృష్ణ, అర్జున్‌ ఎరిగైసి, లలిత్‌బాబు, రాజా రిత్విక్‌ వంటి పలువురు ప్రతిభావంతులైన చెస్‌ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఇప్పుడు వారి బాటలోనే మరో యువ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల మోదుపల్లి దీక్షిత చదరంగంలో అద్భుతమైన ప్రదర్శనలతో వేగంగా ఎదుగుతోంది. అండర్‌-16 విభాగంలో ప్రపంచ అగ్రస్థానానికి చేరుకున్న దీక్షిత.. ఇటీవలే తన తొలి ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ నార్మ్‌ను సాధించి మరో కీలక మైలురాయిని అందుకుంది.

అనంతపురం జిల్లా హంపాపురానికి చెందిన దీక్షిత కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడింది. ఆమె తండ్రి శేషాద్రి నాయుడు సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని వెలాసిటీ చెస్‌ అకాడమీలో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ కృష్ణతేజ వద్ద దీక్షిత చెస్‌లో శిక్షణ పొందింది. జాతీయ అండర్‌-13 ఛాంపియన్‌షిప్‌, జాతీయ పాఠశాల క్రీడల చెస్‌లో విజేతగా నిలిచిన ఆమె.. ఆ తర్వాత యూరోపియన్‌ సర్క్యూట్‌లోనూ సత్తా చాటింది. స్పెయిన్‌, ఫ్రాన్స్‌, పోర్చుగల్‌ వంటి దేశాల్లో జరిగిన టోర్నీల్లో మెరుగైన ర్యాంకుల్లో ఉన్న పలువురు క్రీడాకారులను ఓడించింది. ఆమె రేటింగ్‌ కూడా అతి తక్కువ సమయంలో భారీగా పెరిగింది. తప్పిదం జరిగినా వెనక్కి తగ్గకుండా చివరి వరకు పోరాడే మానసిక బలమే దీక్షిత ప్రత్యేకత అని ఆమె కోచ్‌ కృష్ణతేజ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

డబ్ల్యూటీసీలో భారత్‌కు భారీ సవాల్‌..

డబ్ల్యూటీసీలో భారత్‌కు భారీ సవాల్‌..

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..

పోర్చుగల్‌ కెప్టెన్‌గా మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మోసెస్‌ హెన్రిక్స్‌...

పోర్చుగల్‌ కెప్టెన్‌గా మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మోసెస్‌ హెన్రిక్స్‌...

ట్యాగ్లు
మోదుపల్లి దీక్షితదీక్షిత చెస్‌భారత చెస్‌తెలుగమ్మాయిచెస్‌ ప్రతిభచెస్‌ ప్రాడిజీఇంటర్నేషనల్‌ మాస్టర్‌ నార్మ్‌మహిళల చెస్‌జూనియర్‌ చెస్‌హైదరాబాద్‌ చెస్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?
జనరల్

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా
బిజినెస్

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన
జనరల్

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..
జనరల్

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి
జనరల్

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

కోటి మంది.. ఒకే జెండా!
జనరల్

కోటి మంది.. ఒకే జెండా!

రేవణ్ణపై మరో కేసు..
జనరల్

రేవణ్ణపై మరో కేసు..

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..
జనరల్

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ
జనరల్

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు
జనరల్

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు

శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే?
సినిమాలు

శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే?

తిరుపతికి వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్
జనరల్

తిరుపతికి వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!