

భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్-19 ఆసియా కప్‌లో తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో తన ఆటతీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానినని, దూకుడుగా క్రికెట్ ఆడటం ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. కేవలం తన తండ్రి సెహ్వాగ్ శైలినే కాకుండా కోహ్లీ తరహాలోనూ ఆడాలని అనుకుంటున్నానని చెప్పాడు. ఎదురయ్యే ప్రతి జట్టుపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ, దేశం కోసం మ్యాచ్‌లు గెలిపించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు.
టోర్నీలో ఆర్యవీర్ తన మాటలకు తగ్గట్టుగానే రాణిస్తున్నాడు. నవంబర్ 6న ఒమన్‌లోని అల్ అమెరాత్‌లో నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 52 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 70 పరుగులు చేశాడు. భారత బౌలర్లు నేపాల్‌ను 128 పరుగులకే ఆలౌట్ చేయగా, ఇషాన్ సూద్, అర్జున్ రాజ్‌పుత్ తలో మూడు వికెట్లు తీశారు. అనంతరం ఆర్యవీర్, కెప్టెన్ లక్ష్య రాయచందాని అజేయంగా నిలిచి 19.1 ఓవర్లలోనే భారత్‌కు 10 వికెట్ల విజయాన్ని అందించారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 22 పరుగులు చేసిన అతడు, యూఏఈపై 168 బంతుల్లో 17 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 160 పరుగులు సాధించాడు. భారత్ ఏడు వికెట్లకు 309 పరుగులు చేసి విజయం సాధించడంతో సెమీఫైనల్‌కు అర్హత పొందింది. తండ్రిలా నిర్భయంగా ఆడుతూనే కోహ్లీ ఆటతీరును కూడా అలవర్చుకోవాలనే ఆర్యవీర్ ఆలోచనపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!