11, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూఏఈ తరఫున టెస్ట్ క్రికెట్‌లోకి కేఎస్ భరత్ రీఎంట్రీ.. అసలు కారణమిదే!

Writer: Harika S 02:40 PM, 11 నవంబర్, 2026
యూఏఈ తరఫున టెస్ట్ క్రికెట్‌లోకి కేఎస్ భరత్ రీఎంట్రీ.. అసలు కారణమిదే!

టీమిండియా మాజీ వికెట్ కీపర్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన కేఎస్ భరత్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి రావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి భారత జట్టు తరఫున కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నారు. 2023-2024 మధ్య భారత టెస్ట్ జట్టులో కొనసాగిన భరత్.. దేశం తరఫున ఏడు టెస్టులు ఆడి, 12 ఇన్నింగ్స్‌లలో 221 పరుగులు చేశారు. వికెట్ కీపర్‌గా 18 క్యాచ్‌లు పట్టడంతో పాటు ఒక స్టంపింగ్ చేశారు.

రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో భారత జట్టులో భరత్‌కు అవకాశం లభించింది. అయితే పంత్ తిరిగి జట్టులోకి రావడం, ధ్రువ్ జురెల్‌కు కూడా అవకాశాలు దక్కడంతో భరత్‌కు జట్టులో చోటు పరిమితమైంది. దీంతో విదేశీ క్రికెట్‌లో అవకాశాల కోసం భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం అబుదాబి టీ10 టోర్నీలో పాల్గొనేందుకు యూఏఈలో ఉన్న ఆయన, అక్కడి జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల ప్రకారం మరో దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే నిర్దిష్ట నిరీక్షణ గడువును పూర్తి చేయాలి. ఈ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనున్నట్లు సమాచారం. టెస్ట్ క్రికెట్ ఆడటం ఆటగాడికి లభించే గొప్ప అనుభూతుల్లో ఒకటని భరత్ తెలిపారు. తనలో ఇంకా అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా, ఆసక్తి ఉన్నాయని భావించి భారత క్రికెట్‌ను వీడాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. యూఏఈలో కొత్త కెరీర్‌ను ప్రారంభించడంపై ఉత్సాహంగా ఉన్నానని కూడా వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హార్దిక్‌-అర్ష్‌దీప్ ట్రేడ్‌లో ముంబయిదే పైచేయి - ఇర్ఫాన్ పఠాన్

హార్దిక్‌-అర్ష్‌దీప్ ట్రేడ్‌లో ముంబయిదే పైచేయి - ఇర్ఫాన్ పఠాన్

పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా ఎంట్రీ.. కెప్టెన్సీపై ఆసక్తికర చర్చ

పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా ఎంట్రీ.. కెప్టెన్సీపై ఆసక్తికర చర్చ

బుడాపెస్ట్ చెస్ టోర్నీ: వైశాలి సంచలన విజయం

బుడాపెస్ట్ చెస్ టోర్నీ: వైశాలి సంచలన విజయం

తండ్రి సెహ్వాగ్ శైలితో పాటు కోహ్లీ తరహాలోనూ ఆడతా.. ఆర్యవీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తండ్రి సెహ్వాగ్ శైలితో పాటు కోహ్లీ తరహాలోనూ ఆడతా.. ఆర్యవీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

హార్దిక్ పాండ్యాకు థ్యాంక్స్ చెప్పిన ముంబై
ట్యాగ్లు
కేఎస్ భరత్యూఏఈ క్రికెట్భారత టెస్ట్ క్రికెట్టెస్ట్ క్రికెట్ రీఎంట్రీఅబుదాబి టీ10రిషభ్ పంత్ధ్రువ్ జురెల్తెలుగు క్రికెటర్ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హార్దిక్ పాండ్యాకు థ్యాంక్స్ చెప్పిన ముంబై

అండర్-19 ఆసియా కప్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసం..

అండర్-19 ఆసియా కప్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసం..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి
రాజకీయాలు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి