
సినిమాలు

భారత అథ్లెట్ అంకిత ధ్యాని అమెరికా గడ్డపై సత్తా చాటింది. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ చాలెంజర్ ఈవెంట్‌లో భాగంగా జరిగిన స్టంప్‌టౌన్ ట్విలైట్ టోర్నీలో మహిళల 1500 మీటర్ల రేసులో అంకిత రెండో స్థానంలో నిలిచింది. 24 ఏళ్ల అంకిత 4:06.75 సెకన్లలో రేసును పూర్తి చేసింది.
ఈ ప్రదర్శనతో అంకిత తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ను గణనీయంగా మెరుగుపరుచుకుంది. గతంలో ఆమె 4:12.28 సెకన్ల టైమింగ్‌ను నమోదు చేసింది. తాజా ప్రదర్శన ఈ సీజన్‌లో భారత అథ్లెట్ సాధించిన అత్యంత వేగవంతమైన 1500 మీటర్ల టైమింగ్‌గా నిలిచింది. అంతేకాకుండా ఆసియా అథ్లెట్లలోనూ అత్యుత్తమ టైమింగ్స్‌లో ఒకటిగా నమోదైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!