
జనరల్

13 ఏళ్ల చైనా స్విమ్మర్ యూ జిడీ 2026 ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించింది. జపాన్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో 2:05.08 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకం సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల రికార్డును కూడా బద్దలు కొట్టింది.
వచ్చే నెలలో 14వ ఏట అడుగుపెట్టనున్న యూ జిడీ.. గత ఏడాది 12 ఏళ్ల వయసులోనే స్విమ్మింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించి రికార్డు సృష్టించింది. తాజాగా ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన ఆమె.. భవిష్యత్తులో మరింత వేగంగా ఈత కొట్టాలని, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లోనూ రాణించాలని లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!