
రాజకీయాలు

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన క్రికెట్ జీవితంలో చిరస్మరణీయ ఘట్టాన్ని అందుకున్నాడు. భారత జట్టు జెర్సీని అధికారికంగా స్వీకరించిన వైభవ్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. భారత జట్టు తరఫున ఆడాలన్న తన చిన్ననాటి కల సాకారమైన నేపథ్యంలో వైభవ్ ఆనందానికి అవధులు లేకుండా కనిపించాడు. అతడు జెర్సీ నెంబర్-3తో బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
త్రోడౌన్ స్పెషలిస్టు రఘు చేతుల మీదుగా జెర్సీని స్వీకరించిన వైభవ్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అతని ప్రతిభ, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో అభిమానులు ‘యూనివర్స్ బేబీ బాస్’ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. భారత క్రికెట్‌లో మరో యువ ప్రతిభావంతుడి ఆవిర్భావంగా వైభవ్ ఎదుగుదలను పలువురు కొనియాడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!