

భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత టీమిండియా టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. 2022 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో చివరిసారిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన భువీ.. ఇప్పుడు అదే జట్టుతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఎంపికయ్యాడు. అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్‌లో తొలి టీ20 జరగనుంది.
కొత్త బంతిని స్వింగ్ చేయడంతో పాటు పవర్‌ప్లేలో ప్రభావవంతంగా బౌలింగ్ చేయగల భువనేశ్వర్ అనుభవం భారత బౌలింగ్ విభాగానికి ఉపయోగపడనుంది. టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ కూడా జట్టులో ఉన్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!