
జనరల్

2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అక్టోబర్ 1న ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ మండలి, క్రికెట్ దక్షిణాఫ్రికా సంయుక్తంగా కేప్‌టౌన్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో షెడ్యూల్‌ను వెల్లడించే అవకాశముంది. 2027 ప్రపంచకప్ ప్రారంభానికి సరిగ్గా ఏడాది ముందు ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉండటం విశేషం.
మరోవైపు ప్రపంచకప్‌లో పాల్గొనే పది జట్ల ఖరారుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. ఈ గడువు ముగిసే సమయానికి అర్హత సాధించిన జట్ల జాబితా స్పష్టమవుతుంది. అనంతరం అక్టోబర్ 1న ప్రపంచకప్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 2027 వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!