

భారత యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర తాజా ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో 225.5 పాయింట్లతో ఆసియా నంబర్‌వన్‌గా నిలిచిన విజయవాడకు చెందిన ఈ ఆర్చర్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు మెరుగుపరుచుకుని ఎనిమిదో ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ప్రపంచ టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారత ఆర్చర్‌గా ధీరజ్ నిలవడం విశేషం.
ఇటీవల జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3లో ధీరజ్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించి సత్తా చాటాడు. అనంతరం స్టేజ్-4 టోర్నీలో మిక్స్డ్ విభాగంలో కాంస్య పతక పోరుకు అర్హత సాధించినప్పటికీ, తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. మరోవైపు మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ వెన్నం ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు చేరుకోగా, తానిపర్తి చికిత రెండు స్థానాలు పడిపోయి 52వ ర్యాంక్‌లో నిలిచింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!