
సినిమాలు

సిన్సినాటి ఓపెన్‌లో నొవాక్ జకోవిచ్‌కు భారీ షాక్ తగిలింది. రెండో రౌండ్‌లో అర్జెంటీనా ఆటగాడు థియాగో అగస్టిన్ టిరంటే చేతిలో 2-6, 6-4, 6-4 తేడాతో ఓటమిపాలయ్యాడు. తొలి సెట్‌ను 6-2తో సొంతం చేసుకున్న జకోవిచ్.. ఆ తర్వాతి రెండు సెట్లలో టిరంటే దూకుడును అడ్డుకోలేకపోయాడు.
మ్యాచ్ సందర్భంగా జకోవిచ్ వేడి, అధిక తేమతో కూడిన వాతావరణంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో మ్యాచ్ మధ్యలో అతని ఫిట్‌నెస్‌పై ఆందోళన వ్యక్తమైంది. యూఎస్ ఓపెన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఓటమి జకోవిచ్‌కు సన్నాహక పరంగా ఎదురుదెబ్బగా మారింది.
వింబుల్డన్ తర్వాత జకోవిచ్ ఆడిన తొలి టోర్నీ ఇదే. ఇక యూఎస్ ఓపెన్‌కు ముందు పూర్తి ఫిట్‌నెస్ సాధించి, తన ఆటను మెరుగుపరుచుకోవడంపై జకోవిచ్ దృష్టి పెట్టనున్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!