
క్రీడలు

ఆసియా అథ్లెటిక్స్ పతక విజేత, భారత జావెలిన్ త్రోయర్ శివ్‌పాల్ సింగ్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) 10 ఏళ్ల నిషేధం విధించింది. నిషేధిత అనబాలిక్ స్టెరాయిడ్ మెథాండినోన్ వినియోగించినట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. గతంలోనూ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఇది అతనికి రెండో నేరంగా పరిగణించి కఠిన శిక్ష విధించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆసియా క్రీడల హెప్టాథ్లాన్ స్వర్ణ పతక విజేత స్వప్నా బర్మన్ కూడా డోపింగ్ పరీక్షలో విఫలమయ్యారు. నిషేధిత అనబాలిక్-ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్ బోల్డెనోన్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో నాడా ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఇటీవలే ఆమె అథ్లెటిక్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, డోపింగ్ కేసులో విచారణ కొనసాగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!