

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 2027 వన్డే ప్రపంచకప్ భారత్ తరఫున తనకు చివరి ప్రపంచకప్ అని స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. 2027 ప్రపంచకప్‌లో తాను ఆడబోతున్నట్లు స్పష్టత ఇచ్చాడు. ఈ మెగా టోర్నీలో ప్రపంచకప్ గెలవడమే తన ప్రధాన లక్ష్యమని, అందుకోసం పూర్తిస్థాయిలో సిద్ధమవుతానని చెప్పాడు.
మరోవైపు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 2027 ప్రపంచకప్ కోసం ఎదురుచూస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. అయితే తన కెరీర్‌లో అదే చివరి ప్రపంచకప్ అని ఆయన నేరుగా ప్రకటించలేదు. తాను ఏదైనా లక్ష్యంగా పెట్టుకుంటే అది పూర్తయ్యే వరకు దానిపైనే దృష్టి పెడతానని రోహిత్ తెలిపాడు. విభిన్న వేదికలు, భిన్న ప్రత్యర్థులతో జరిగే ప్రపంచకప్ ఎప్పుడూ సవాలుతో కూడుకున్నదని, అందుకు తగ్గట్టుగా సన్నద్ధత కూడా భిన్నంగా ఉండాలని పేర్కొన్నాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!