

టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ అంతర్జాతీయ క్రికెట్‌లో నిరంతర పర్యటనలు, మ్యాచ్‌ల ఒత్తిడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్‌తో ఐదో టీ20 అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఒక్కోసారి తాను కూడా మానసికంగా అలసిపోతానని వెల్లడించారు. అయితే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసని, అందుకోసం మనసును, శరీరాన్ని మరింత దృఢంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. తాను కూడా మనిషినేనని, కొన్నిసార్లు మానసికంగా గందరగోళంగా అనిపిస్తుందని పేర్కొన్నారు. తన ఆలోచనా విధానంలో భయం అనే మాటకు చోటు లేదని, వృత్తిపరమైన బాధ్యతల్లో సాకులు చెప్పడానికి తావులేదని స్పష్టం చేశారు.
టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉండటం అంత సులభం కాదని గంభీర్ అన్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ జట్టు గెలవాలని అభిమానులు ఆశిస్తారని, అందరి దృష్టి కోచ్‌పైనే ఉంటుందని వివరించారు. భారీ అంచనాలు, ఒత్తిడి ఉన్నప్పటికీ తన బాధ్యతలను పూర్తిగా ఆస్వాదిస్తున్నానని, అలసట ఎదురైనప్పుడు వెంటనే కోలుకుని తిరిగి పనిలో నిమగ్నమవుతానని తెలిపారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ నవంబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా కొనసాగుతున్నారు. ఒకేసారి వేర్వేరు సిరీస్‌లు జరిగినప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!