2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంగాళాఖాతంలో బలపడిన మురసు..ఏపీలో హై అలర్ట్!

Writer: Pooja 10:51 AM, 2 నవంబర్, 2026
బంగాళాఖాతంలో బలపడిన మురసు..ఏపీలో హై అలర్ట్!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుపాను తీవ్ర తుపానుగా బలపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గత ఆరు గంటల్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ తుపాను చెన్నైకి 200 కిలోమీటర్లు, నెల్లూరుకు 210 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 270 కిలోమీటర్లు, కావలికి 310 కిలోమీటర్లు, ఒంగోలుకు 330 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని హెచ్చరించారు.

తుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురవవచ్చని తెలిపారు. అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం ముందస్తుగా ఆరు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఏడు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్‌ రిసార్ట్‌కు సమీపంలో ఘోర విమాన ప్రమాదం

ట్రంప్‌ రిసార్ట్‌కు సమీపంలో ఘోర విమాన ప్రమాదం

రష్యా, ఉక్రెయిన్ అలర్ట్ వ్యవస్థలపై సైబర్ దాడులు

రష్యా, ఉక్రెయిన్ అలర్ట్ వ్యవస్థలపై సైబర్ దాడులు

విజయవాడ ఓటర్లలో భారీగా తగ్గిన పోలింగ్

విజయవాడ ఓటర్లలో భారీగా తగ్గిన పోలింగ్

ఆధారాలు లేకుండా రీపోలింగ్‌ కుదరదు - అనిల్‌చంద్ర పునేఠా

ఆధారాలు లేకుండా రీపోలింగ్‌ కుదరదు - అనిల్‌చంద్ర పునేఠా

వింటి నుంచి విడిచిన బాణంలా..నారాయణ పక్షి అద్భుత విన్యాసం

వింటి నుంచి విడిచిన బాణంలా..నారాయణ పక్షి అద్భుత విన్యాసం

ఋషికొండ తీరానికి కొట్టుకొచ్చిన బోటు..!

ఋషికొండ తీరానికి కొట్టుకొచ్చిన బోటు..!

ట్యాగ్లు
మురసు తుపానుఆంధ్రప్రదేశ్ వాతావరణంభారీ వర్షాలుతుపాను హెచ్చరికఎన్డీఆర్‌ఎఫ్ బృందాలుతీర ప్రాంత భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాజీపేట ప్లాట్‌ఫాంపై మూడు రంగుల గీతలు..ఒక్కో దాని వెనుక ప్రత్యేక ఉద్దేశం
జనరల్

కాజీపేట ప్లాట్‌ఫాంపై మూడు రంగుల గీతలు..ఒక్కో దాని వెనుక ప్రత్యేక ఉద్దేశం

ట్రంప్‌ రిసార్ట్‌కు సమీపంలో ఘోర విమాన ప్రమాదం
జనరల్

ట్రంప్‌ రిసార్ట్‌కు సమీపంలో ఘోర విమాన ప్రమాదం

బంగాళాఖాతంలో బలపడిన మురసు..ఏపీలో హై అలర్ట్!
జనరల్

బంగాళాఖాతంలో బలపడిన మురసు..ఏపీలో హై అలర్ట్!

జనవరి 12 విడుదల లక్ష్యంగా షూటింగ్.. చివరి దశకు చేరుకున్న సినిమా
సినిమాలు

జనవరి 12 విడుదల లక్ష్యంగా షూటింగ్.. చివరి దశకు చేరుకున్న సినిమా

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

త్రివిక్రమ్ సినిమాలు హీరోయిన్ల కెరీర్‌కు ఎంతవరకు కలిసొచ్చాయి?
గాసిప్స్

త్రివిక్రమ్ సినిమాలు హీరోయిన్ల కెరీర్‌కు ఎంతవరకు కలిసొచ్చాయి?

బిగ్‌బాస్ తెలుగు 10.. డే 57 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10.. డే 57 ప్రోమో 1 విడుదల

టైటిల్ రోల్ నాది కాకపోయినా సినిమా చేశా.. దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

టైటిల్ రోల్ నాది కాకపోయినా సినిమా చేశా.. దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

గాడ్‌ఫాదర్లు లేకున్నా వెనక్కి తగ్గేది లేదంటున్న మిస్ వరల్డ్ మానుషి చిల్లర్?
సినిమాలు

గాడ్‌ఫాదర్లు లేకున్నా వెనక్కి తగ్గేది లేదంటున్న మిస్ వరల్డ్ మానుషి చిల్లర్?

రష్యా, ఉక్రెయిన్ అలర్ట్ వ్యవస్థలపై సైబర్ దాడులు
జనరల్

రష్యా, ఉక్రెయిన్ అలర్ట్ వ్యవస్థలపై సైబర్ దాడులు

ఐశ్వర్య రాయ్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
గాసిప్స్

ఐశ్వర్య రాయ్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఆదర్శంగా నిలుస్తున్న సూర్య, ధనుష్?
సినిమాలు

ఆదర్శంగా నిలుస్తున్న సూర్య, ధనుష్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!