
సినిమాలు

2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టుకు మార్గదర్శకత్వం వహించిన అర్జున అవార్డు గ్రహీత, కోచ్ నీతా దడ్వే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, కబడ్డీ క్రీడాకారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
ఆసియాడ్‌లో భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణ పతకం సాధించడంలో నీతా దడ్వే అందించిన శిక్షణ, వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని ఈ సందర్భంగా అధికారులు, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి మహేందర్ రెడ్డి, సలహాదారులు జగదీష్ యాదవ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ కుమార్, పీఆర్ఓ కాలేరు సురేష్, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!