

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఐపీఎల్ భవితవ్యంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముంబయి ఇండియన్స్‌ను వీడేందుకు హార్దిక్ ఆసక్తి చూపుతున్నాడని, కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి ఫ్రాంచైజీలు అతడిని తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. తాజాగా హార్దిక్ తన పాత జట్టు గుజరాత్ టైటాన్స్‌కు తిరిగి వెళ్లే అవకాశాలపై కూడా ప్రచారం సాగుతోంది. జీటీ మేనేజ్‌మెంట్ సైతం అతడి రాకకు సుముఖంగా ఉన్నప్పటికీ.. కెప్టెన్సీ విషయంలో వచ్చిన షరతుతో చర్చలు నిలిచిపోయినట్లు సమాచారం.
గుజరాత్ టైటాన్స్ వర్గాల ప్రకారం.. హార్దిక్‌ను తిరిగి ట్రేడ్ చేసుకునే అంశంపై ఫ్రాంచైజీ ఆసక్తి చూపింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తోనూ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే హార్దిక్ కెప్టెన్సీ కావాలని షరతు పెట్టడంతో మేనేజ్‌మెంట్ అందుకు అంగీకరించలేదని సమాచారం. మరోవైపు హార్దిక్ ఇప్పటివరకు ఏ ఇతర ఐపీఎల్ ఫ్రాంచైజీతోనూ చర్చలు జరపలేదని అతడి సన్నిహితులు స్పష్టం చేశారు. తన భవిష్యత్తుపై ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీకి తెలియజేస్తాడని హార్దిక్ ప్రతినిధి వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!