

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్‌పై 95 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. హెడింగ్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 47 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ జట్టు 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన మంధాన, లీడ్స్ వికెట్ బ్యాటింగ్‌కు ఎంతో అనుకూలమని పేర్కొంది. వరుసగా రెండో అర్ధశతకం సాధించినప్పటికీ తన ఆటపై పూర్తిగా సంతృప్తి లేదని, ఇంకా మెరుగుపడాల్సి ఉందని తెలిపింది. అలాగే షెఫాలీ వర్మ బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూ, ఆమె ఫామ్‌లోకి రావడం జట్టుకు కీలకమని పేర్కొంది. బౌలర్ శ్రీ చరణి ప్రదర్శనను కూడా కొనియాడింది. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న భారత్ జూన్ 21న మాంచెస్టర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!