

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 మందితో కూడిన భారత ‘ఎ’ జట్టును ప్రకటించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మకు జట్టులో చోటు కల్పించింది. తిలక్ వర్మ కెప్టెన్‌గా, రజత్ పటీదార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. రింకూ సింగ్, హర్షిత్ రాణా, రియాన్ పరాగ్ వంటి ఆటగాళ్లకూ అవకాశం దక్కింది.
ఈ టోర్నీ నవంబర్ 19 నుంచి 29 వరకు ఖతార్ రాజధాని దోహాలో జరగనుంది. మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో బంగ్లాదేశ్, శ్రీలంక, హాంకాంగ్-చైనా, అఫ్గానిస్థాన్ ఉండగా.. గ్రూప్-బీలో భారత్, పాకిస్థాన్, నేపాల్, యూఏఈ ఉన్నాయి.
భారత ‘ఎ’ జట్టు: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (కెప్టెన్), రజత్ పటీదార్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, కుమార్ కుషాగ్ర (వికెట్ కీపర్), సూర్యాంశ్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, విప్రాజ్ నిగమ్, హర్ష్ దూబే, తనుష్ కొటియన్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షద్ ఖాన్.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!