
జనరల్

భారతదేశ బొగ్గు రంగంలో అక్టోబర్ నెలలో గణనీయమైన పురోగతి నమోదైంది. క్యాప్టివ్, కమర్షియల్ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి 42 శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్‌లో ఈ గనుల నుంచి మొత్తం 22.03 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. గత ఏడాదితో పోలిస్తే బొగ్గు డిస్పాచెస్ 36 శాతం వృద్ధి చెందాయి. జార్ఖండ్‌లోని లోహరి గనితో కలిపి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87 క్యాప్టివ్, కమర్షియల్ గనులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడమే కేంద్ర బొగ్గు శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో క్యాప్టివ్, కమర్షియల్ గనుల కార్యకలాపాలను విస్తరించడంతో పాటు ఉత్పత్తి, సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!