

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2026 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు త్వరగా అవుట్ అయినప్పటికీ, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన 44 బంతుల్లో 68 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 పరుగులతో కీలక భాగస్వామ్యం అందించగా, రిచా ఘోష్ 17 బంతుల్లో 34 పరుగులతో మెరుపులు మెరిపించింది. దీంతో భారత్ 20 ఓవర్లలో 170/6 పరుగులు చేసింది.
171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు భారత స్పిన్నర్ల ధాటికి కుప్పకూలింది. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 4 ఓవర్లలో 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చింది. ఈ ప్రదర్శనతో మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించింది. శ్రీ చరణి మూడు వికెట్లు తీసి అద్భుత సహకారం అందించింది. పాకిస్తాన్ 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!