20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం

Writer: Pooja 07:38 PM, 20 సెప్టెంబర్, 2026
కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన ప్రీక్వార్టర్‌ ఫైనల్‌ పోరులో భారత్‌ 3-0తో కజకిస్థాన్‌ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత షట్లర్లు పి.వి. సింధు, ఉన్నతి హుడా, తన్వి శర్మ తమ సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. తొలి సింగిల్స్‌లో పి.వి. సింధు 21-7, 21-9తో కామిలా స్మాగులోవాపై గెలిచింది. రెండో సింగిల్స్‌లో ఉన్నతి హుడా 21-7, 21-10తో అలెస్సా కులేషోవాను ఓడించి భారత్‌ ఆధిక్యాన్ని 2-0కి పెంచింది.

మూడో సింగిల్స్‌లో తన్వి శర్మ 21-5, 21-10తో డయానా నమేనోవాపై విజయం సాధించి భారత్‌కు 3-0తో క్లీన్‌ స్వీప్‌ అందించింది. ఈ మూడు మ్యాచ్‌లను భారత షట్లర్లు మొత్తం 65 నిమిషాల్లోనే ముగించారు. దీంతో భారత మహిళల జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరగనున్న క్వార్టర్‌ ఫైనల్‌లో ఆతిథ్య జపాన్‌తో భారత్‌ తలపడనుంది. తొలి రౌండ్‌లో బై పొందిన జపాన్‌తో పోరు భారత జట్టుకు కీలకంగా మారనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో వరుణ్ సన్యాల్‌కు ఊహించని షాక్

ఆసియా క్రీడల్లో వరుణ్ సన్యాల్‌కు ఊహించని షాక్

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

స్మృతి మంధాన ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

స్మృతి మంధాన ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...

ఆసియా గేమ్స్‌ ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్ల సందడి..

ఆసియా గేమ్స్‌ ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్ల సందడి..

ట్యాగ్లు
భారత మహిళల బ్యాడ్మింటన్ఆసియా క్రీడలుపి.వి. సింధుఉన్నతి హుడాతన్వి శర్మకజకిస్థాన్‌పై విజయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్
గాసిప్స్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం
క్రీడలు

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం
జనరల్

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
జనరల్

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం
జనరల్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన
జనరల్

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్
జనరల్

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు
జనరల్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
జనరల్

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
జనరల్

బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి
జనరల్

ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి

పెజెష్కియాన్ అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్
జనరల్

పెజెష్కియాన్ అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!