

డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ దశను అద్భుత విజయంతో ముగించింది. జోర్డాన్‌పై 3-1 తేడాతో విజయం సాధించి వరుసగా మూడో గెలుపును నమోదు చేసింది. ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించిన అర్జెంటీనా ఈ మ్యాచ్‌లో మెస్సీని రెండోార్థంలో బరిలోకి దింపింది. 80వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను అద్భుతంగా గోల్‌గా మలిచిన మెస్సీ అభిమానులను అలరించాడు. జియోవాని లో సెల్సో, లాటారో మార్టినెజ్ మరో రెండు గోల్స్ నమోదు చేయగా, జోర్డాన్ తరఫున ముసా టామారి ఏకైక గోల్ సాధించాడు. ఈ విజయంతో అర్జెంటీనా గ్రూప్ విజేతగా నాకౌట్‌లోకి అడుగుపెట్టింది.
మరోవైపు డీఆర్ కాంగో 52 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ ఉజ్బెకిస్థాన్‌పై 3-1తో గెలిచి తొలిసారి ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరుకుంది. యోవానే విస్సా రెండు గోల్స్ చేయగా, ఫిస్టన్ మయెలే మరో గోల్ సాధించాడు. ఇదే ప్రపంచకప్‌లో మొరాకో, దక్షిణాఫ్రికా, సెనెగల్, ఐవరీ కోస్ట్, ఘానా, కేప్ వెర్డె, ఈజిప్ట్‌తో కలిసి మొత్తం ఎనిమిది ఆఫ్రికా జట్లు నాకౌట్‌కు అర్హత సాధించడం కొత్త చరిత్రగా నిలిచింది. ఇదే సమయంలో ఆస్ట్రియా, అల్జీరియా, క్రొయేషియా కూడా తదుపరి దశకు చేరగా, ఇంగ్లాండ్ గ్రూప్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!