

19 ఏళ్ల పాటు ఐపీఎల్‌లో సారథిగా, బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా తనదైన ముద్ర వేసిన మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగా తన ప్రయాణాన్ని ముగించనున్నారనే వార్త అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుతో మెంటార్‌గా తన అనుబంధాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ధోని భార్య సాక్షి ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. జీవితంలో అందమైన కొత్త ప్రయాణం ప్రారంభం కావాలంటే కొన్ని అధ్యాయాలకు ముగింపు పలకాల్సిందేనని ఆమె పేర్కొన్నారు.
పర్వతాల వైపు చూస్తున్న ధోని ఫొటోను షేర్ చేసిన సాక్షి.. ఇన్నేళ్లుగా మహీని ప్రేమించి, నమ్మిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొంటూ.. కొత్త ఆరంభాలు, సరికొత్త సాహసాలు, మరెన్నో అందమైన జ్ఞాపకాలకు స్వాగతం పలికారు. ‘మహీ.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’ అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోల్‌కతాలోని తాజ్ హోటల్‌లో పరిచయమైన ధోని, సాక్షి మధ్య స్నేహం ప్రేమగా మారింది. 2010లో దేహ్రాదూన్‌లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!