
జనరల్

జూన్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు ముందు భారత జట్టుకు కీలక ఊరట లభించింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్నెస్ సాధించాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అన్ని ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత అతడికి మెడికల్ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ వెన్ను నొప్పి కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. జూన్ 2 నుంచి రిహాబ్, శిక్షణలో పాల్గొన్న అతడు నొప్పి లేకుండా 10 ఓవర్లు బౌలింగ్ చేసినట్లు సమాచారం. దీంతో అతడు వన్డే ఫార్మాట్‌కు పూర్తిగా సిద్ధమయ్యాడని భావిస్తున్నారు. అయితే ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్‌లో నేరుగా జట్టులో చేరతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!