

జపాన్‌లో జరగనున్న 2026 ఆసియా క్రీడల్లో క్రికెట్ పోటీలను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. 2023లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లు ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌లుగా బరిలోకి దిగనున్నాయి. రెండు జట్లూ నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. పురుషుల విభాగంలో భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక టాప్ సీడ్ జట్లుగా నేరుగా చివరి ఎనిమిది స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. మిగిలిన నాలుగు బెర్తుల కోసం గ్రూప్-ఎలో అఫ్గానిస్థాన్, జపాన్, నేపాల్.. గ్రూప్-బిలో హాంకాంగ్ చైనా, మలేసియా, ఒమన్ పోటీ పడనున్నాయి. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంటాయి.
భారత పురుషుల జట్టు సెప్టెంబర్ 28న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 1న సెమీ ఫైనల్స్, అక్టోబర్ 3న కాంస్య పతకంతో పాటు స్వర్ణ పతక పోరును నిర్వహించనున్నారు. మహిళల విభాగంలో ఎనిమిది జట్ల మధ్య నేరుగా నాకౌట్ పద్ధతిలో సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో భారత్ జపాన్‌తో, చైనా బంగ్లాదేశ్‌తో, మలేసియా శ్రీలంకతో, థాయ్‌లాండ్ పాకిస్థాన్‌తో తలపడనున్నాయి. ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో 2010, 2014, 2023 ఎడిషన్లలో క్రికెట్ పోటీలు జరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!