

జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో చైనాను 1-0తో ఓడించి స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. 1982 తర్వాత ఆసియా క్రీడల్లో మహిళల హాకీ జట్టు మళ్లీ స్వర్ణం సాధించడం, 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించడం గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు. ఫైనల్లో 10వ నిమిషంలో లాల్‌రెమ్‌సియామి కీలక గోల్ చేయగా, వెటరన్ గోల్‌కీపర్ సవితా పునియా పెనాల్టీ స్ట్రోక్‌ను అడ్డుకుని భారత్ ఆధిక్యాన్ని కాపాడారు. ఈ విజయంతో భారత మహిళల హాకీ జట్టు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది.
భారత మహిళల జట్టు ప్రదర్శన, దృఢ సంకల్పాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. లాల్‌రెమ్‌సియామి చేసిన గోల్‌తో పాటు సవితా పునియా కీలక సమయంలో చేసిన సేవ్‌ను ఆయన అభినందించారు. మహిళల జట్టు సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. అక్టోబర్ 2న భారత్ మొత్తం ఆరు స్వర్ణ పతకాలు సాధించగా, ఆ దశలో దేశం 16 స్వర్ణాలు సహా మొత్తం 76 పతకాలతో పతకాల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!