19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ధోనీతో మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న రోహిత్

Writer: Pooja 02:07 PM, 18 నవంబర్, 2026
ధోనీతో మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న రోహిత్

ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయంతో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికినట్లు వచ్చిన వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి. అయితే, చెన్నై సూపర్ కింగ్స్‌కు మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ధోనీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో అతడు అందించిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా ధోనీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు. మైదానంలో, మైదానం వెలుపల ధోనీతో కలిసి పంచుకున్న జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయని పేర్కొన్నాడు. అతడిపై తనకున్న గౌరవం ఎప్పటికీ తగ్గదని తెలిపాడు.

మరోవైపు, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా ధోనీ సేవలను కొనియాడారు. ఐపీఎల్ ఎదుగుదల, విజయాల్లో ధోనీ కీలక పాత్ర పోషించాడని, నాయకుడిగా అతడు సాధించిన విజయాలు యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ సైతం ధోనీని అత్యంత విజయవంతమైన సారథిగా అభివర్ణించారు. ప్రసిద్ధ నంబర్ 7 జెర్సీతో పసుపు రంగు దుస్తుల్లో సీఎస్‌కేకు ఎన్నో విజయాలు అందించాడని కొనియాడారు. ఇకపై మైదానంలో ధోనీ ఆటను చూడలేకపోయినా, చెపాక్‌లో అతడి ప్రభావం కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. రాబోయే తరానికి మెంటార్‌గా ధోనీ మార్గనిర్దేశం చేయడం భారత క్రికెట్‌కు ఎంతో ఉపయోగకరమని పేర్కొంటూ అతడికి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘టైమ్‌ 100 నెక్స్ట్‌ – భారత్‌’ జాబితాలో వైభవ్‌ సూర్యవంశీ..

‘టైమ్‌ 100 నెక్స్ట్‌ – భారత్‌’ జాబితాలో వైభవ్‌ సూర్యవంశీ..

శాండ్‌పేపర్‌ వివాదంపై షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు..

శాండ్‌పేపర్‌ వివాదంపై షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు..

సిరాజ్‌ను పక్కన పెట్టడం తప్పు నిర్ణయం కాదు - సితాంశు కొటక్‌

సిరాజ్‌ను పక్కన పెట్టడం తప్పు నిర్ణయం కాదు - సితాంశు కొటక్‌

న్యూజిలాండ్‌పై బుమ్రా బుల్లెట్ బౌలింగ్..

న్యూజిలాండ్‌పై బుమ్రా బుల్లెట్ బౌలింగ్..

భారత్ వర్సెస్ న్యూజిలాండ్: నికోల్స్‌ సెంచరీతో తొలి రోజు న్యూజిలాండ్‌ ఆధిపత్యం

భారత్ వర్సెస్ న్యూజిలాండ్: నికోల్స్‌ సెంచరీతో తొలి రోజు న్యూజిలాండ్‌ ఆధిపత్యం

మరో వివాదంలో చెస్‌ దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌

మరో వివాదంలో చెస్‌ దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌

ట్యాగ్లు
ఎంఎస్ ధోనీధోనీ వీడ్కోలురోహిత్ శర్మచెన్నై సూపర్ కింగ్స్ఐపీఎల్ వార్తలుభారత క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కార్పొరేట్‌ సంస్థలపై మోదీ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

కార్పొరేట్‌ సంస్థలపై మోదీ కీలక వ్యాఖ్యలు

మ్యూజికల్‌ జీనియస్‌ అనిరుధ్‌.. అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మ్యూజికల్‌ జీనియస్‌ అనిరుధ్‌.. అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు
సినిమాలు

కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!