
సినిమాలు

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ తీసుకొచ్చిన ‘రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ’ మార్గదర్శకాలను స్వాగతించారు. ప్రసవం అనంతరం మహిళా ఆటగాళ్లు తిరిగి ప్రొఫెషనల్ క్రికెట్లోకి రావడానికి ఈ మార్గదర్శకాలు కీలకంగా ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
మహిళల క్రికెట్ భవిష్యత్తుకు ఇది గొప్ప ఊతమని సచిన్ అభిప్రాయపడ్డారు. క్రీడల్లో సాధికారత అంటే ఆటగాళ్ల జీవితంలోని ప్రతి దశలో వారికి అవసరమైన మద్దతు అందించడం అని ఆయన అన్నారు. ప్రసవం తర్వాత కూడా మహిళలు తమ క్రీడా జీవితాన్ని విజయవంతంగా కొనసాగించగలరని పేర్కొన్నారు. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం క్రీడా ప్రపంచం సరైన దిశగా ముందుకు సాగుతోందనడానికి నిదర్శనమని, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్లోకి రావాలనుకునే మహిళలకు ఇది మరింత ప్రేరణనిస్తుందని సచిన్ హర్షం వ్యక్తం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!